FLAXSEED GEL for Rapid hair growth and it really worked

జుట్టు రాలడాన్ని ఆపడంలో అద్బుతమైన ఫలితాలు ఇచ్చే సీక్రెట్ జెల్ ఇదే

జుట్టు రాలే సమస్య ఉన్నవారు లేదా జుట్టు పల్చబడినవారు ఏదైనా మంచి ఇంటి నివారణ చిట్కా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అద్భుతమైన ఫలితాలనిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. దాని కోసం తీసుకోవాల్సిన పదార్థాలు కేవలం మూడు. మారిపోతున్న జీవనశైలి, చుట్టూ ఉండే కాలుష్యం, తినే ఆహారంలో కల్తీ, ఇవన్నీ కూడా మొదట మన జుట్టుపై ప్రభావం చూపిస్తున్నాయి. జుట్టు నిర్జీవంగా తయారవడం, పగిలిపోవడం, రాలిపోవడం వంటి అనేక రకాల సమస్యలతో మనం ఎక్కువగా ఇబ్బందిపడుతూ ఉంటాం. ఈ సమస్య తగ్గించుకోవడానికి ఆహారపదార్థాలలో కొన్ని నివారణకు చిట్కాలుగా వాడితే అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.

 దాని కోసం మనం తీసుకోవాల్సినవి ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిస గింజలు వీటిని ఒక గ్లాసు నీటిలో వేసి తయారై ఎంతవరకు బాగా మరిగించాలి. అవిస గింజలు జుట్టు పెరుగుదలకు చాలా బాగా పనిచేస్తాయి. కుదుళ్ళను బలంగా తయారు చేసి జుట్టు బలంగా పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది. నీటిలో రెండు స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ వేసి కొంచెం మరగడం స్టార్ట్ అవ్వగానే గరిటతో కలుపుతూ ఉండాలి. అలా కలపడం వల్ల ఫ్లాక్ సీడ్స్ అన్ని బాగా మరిగి జెల్ బాగా తయారవుతుంది. ఫ్లాక్స్ సీడ్ జెల్ తయారవగానే స్టవ్ కట్టేసి నీటిని వడకట్టుకోవాలి. 

ఈ నీటిని వేడిగా ఉండగానే వడకట్టాలి. లేదంటే జెల్ తీయడం కష్టమైపోతుంది. పలుచని గుడ్డలో అవిసె గింజల జెల్ వేసి బాగా పిండితే అందులో ఉండే జెల్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ జెల్ ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా మీరు తలకు ఉపయోగించి ఏదైనా నూనెను కలుపుకోవాలి. అవిసె గింజల జెల్ తనకు నేరుగా పూయడం వల్ల జుట్టు రఫ్ గా తయారవుతుంది. నూనె జుట్టును మెత్తగా, షైనీగా ఉండేందుకు సహకరిస్తుంది. తరువాత ఇందులో మనం ఒక సీక్రెట్ పదార్థాన్ని కలపబోతున్నాం. ఇది జుట్టు పెరుగుదలను చాలా బాగా పెంచుతుంది. అదే కలోంజి పౌడర్.

 కలోంజిని పొడిగా చేసుకుని పెట్టుకుంటే ఈ మిశ్రమం తయారు చేసుకున్న వెంటనే ఒక స్పూన్ కలిపి తలకు అప్లై చేసుకోవచ్చు. కలోంజి మనకు సూట్ అయిందా లేదా అనేది గమనించి వాడుకోవడం మంచిది. తరువాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తలకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ గా ఉండే ఏదైనా షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి ఉపయోగించడం వలన జుట్టు మెత్తగా, పొడవుగా, షైనీగా తయారవుతుంది. జుట్టు కుదుళ్లకు కావలసిన పోషణ అందడంతో జుట్టు పెరుగుదల రెండు రెట్లు అధికంగా ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!