follow these 5 tips to sharp your brain

మెదడు చురుగ్గా పనిచేయడానికి 5 చిట్కాలు

చదివిన వెంటనే మర్చిపోతున్నారా? మీరు చేసే పనుల్లో చురుగ్గా ఉండలేక పోతున్నారా? అయితే ఇది మీకోసమే. మనిషి అవయవాలలో మెదడు అత్యంత కీలకమైనది. మన శరీరంలోని ప్రతి అవయవం మెదడు నియంత్రణలోనే ఉంటుంది. అంటే మెదడు చురుగ్గా ఉంటే మన బాడీ యాక్టివ్ గా పని చేస్తుందన్నమాట. మరి అంత కీలకమైన మెదడును హెల్దీగా షార్ప్ గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం గ్యాప్ లేకుండా పని చేస్తుంటే ఎలా అలసిపోతామో  మెదడు కూడా అలానే అలసిపోతుంది. మెదడు చురుగ్గా పని చేయాలంటే రోజులో కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. అయితే నిద్ర పోయినప్పుడు కూడా బ్రెయిన్ పని చేస్తూనే ఉంటుంది ఆ రోజులో అప్పటివరకు చూసిన విన్న సంఘటనలు అన్నీరీకలెక్ట్ చేసుకుని అనలైజ్ చేయడం మొదలుపెడుతుంది. వేటిని పర్మినెంట్ గా గుర్తించుకోవాలి వేటిని టెంపరరీ మెమరీ లో స్టోర్ చేయాలి ఏ అంశాలను డిలీట్ చేయాలి అని కేటగిరీలుగా విభజించి దాని పని అది చేసుకుపోతుంది. ఈ ప్రక్రియ పూర్తవగానే బ్రెయిన్లో స్టోర్  అయిన వేస్టేజ్ అంతా డిలీట్ అయిపోయి రిలాక్స్ అయిపోతుంది. దీంతో లేవగానే బ్రెయిన్ షార్ప్ గా పని చేయడం మొదలుపెడుతుంది.

మెదడు చురుగ్గా పని చేయాలంటే విశ్రాంతితో పాటు దానికి సరైన పోషక పదార్థాలు అందాలి. తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్లు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. మెదడును  సూపర్ షార్ప్ గా చేసి ఫుడ్స్ లో వాల్ నట్స్ ముఖ్యమైనవి. మెదడు ఆకారంలో ఉండే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా త్రీ ఫ్యాట్ ఆమ్లాలతో పాటు విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇవి జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

మెదడుకు సంబంధించి బలవర్ధక ఆహారాలలో గుడ్డు ఒకటి. ప్రతిరోజు ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డు ని మీ బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చేసుకుంటే మీ బ్రెయిన్ కు పదును పెడుతున్న అంటే లెక్క. గుడ్డులో కోలైన్ అనే పదార్థం ఉంటుంది ఇది జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు మెదడు షార్ప్ గా ఆలోచించడానికి అనుగుణంగా బ్రెయిన్ సిద్ధం చేస్తుంది.

వీటితో పాటు పాలు చేప అరటి పండ్లు దానిమ్మ బంగాళదుంపలు టమోటా గుమ్మడి గింజలు ఆకుకూరలు మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. వీటిలో ఉండే పొటాషియం మెగ్నీషియం పోలిక్ యాసిడ్ మీ బ్రెయిన్ ని మరింత షార్ప్ గా మారుస్తాయి. అలాగే రోజుకు రెండు కప్పులకు మించకుండా కాఫీ తాగండి. కాఫీలోని కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్రెయిన్ షార్ప్ చేస్తుంది.రోజుకు మూడు లీటర్ల తగ్గకుండా నీటిని తాగుతూ ఉండాలి.

వీటితోపాటు ప్రప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. సూర్యరశ్మి నుండి వచ్చే విటమిన్ డి  బ్రెయిన్ ను ఆక్టివ్ చేస్తుంది. నాలుగు గోడల మధ్య కాకుండా ఎక్కువగా ప్రకృతిలో గడపడం అలవాటు చేసుకోవాలి. అనవసర విషయాల్లో ఆలోచించి బ్రెయిన్ ఒత్తిడికి గురి చేయకుండా మనకు అవసరమైన వాటి మీదే దృష్టి పెట్టండి. అలాగే పజిల్స్ సాల్వ్  చేయడం అలాగే బ్రెయిన్ కు సంబంధించిన గేమ్స్ ఆడడం అలవర్చుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే పాటిస్తే కొద్దిరోజుల్లోనే మీ బ్రెయిన్ చురుగ్గా మారడంతోపాటు చాలా యాక్టివ్ గా తయారవుతారు.

Leave a Comment

error: Content is protected !!