మనం తినే ఆహారాలలో రెండు విరుద్ధ ఆహారాలు కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం తెలియకుండా ఇలా తినటం వల్ల చర్మ సమస్యలు, శ్వాసకోస సమస్యలు మరియు ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మన ఎక్కువగా వినేది గుడ్డు- పొట్లకాయ. ఈ రెండు కలిపి తినకూడదని మనం వింటూ ఉంటాం. ఏదైనా రెండు ఆహారాలు కలిపి తిన్నప్పుడు మనం తిన్న ఆహారం ఒకేసారి జీర్ణమయ్యేలా ఉండాలి. అలా కాకుండా పొట్లకాయ నీటితో నిండి ఉండడం వలన త్వరగా జీర్ణం అవుతుంది. గుడ్డు ప్రొటీన్లతో నిండి ఉండడం వలన జీర్ణం కావడానికి కొద్దిగా సమయం పడుతుంది.
ఇలా ఒకసారి తిన్న ఆహారం ఎక్కువసేపు జీర్ణం కావడానికి సమయం పట్టడం వలన చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వంకాయ- గోంగూర కలిపి తినకూడదని చెబుతుంటారు. 2 వేడి చేసే స్వభావం గల కూరగాయలు చర్మ సమస్యలు ఉన్నవారికి పత్యం చేస్తున్న వారికి వంకాయ , గోంగూర అసలు తినకూడదని చెబుతుంటారు. ఇవి కలిపి తినడం వలన చర్మంపై దద్దుర్లు, ఊపిరి తీసుకోవడం కష్టమవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే రాత్రిపూట ఉసిరి పచ్చడి తినకూడదని చెబుతుంటారు. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రాత్రులు ఎక్కువగా విటమిన్ సి తీసుకోవడం వల్ల అది జీర్ణం అవ్వక జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విటమిన్ సి రాత్రులు తీసుకోవడం వలన చాతిలో కఫం పెరిగుతుంది. ఇక పాలకూర, టమాట కూడా కలిపి తినకూడదు అంటారు. అలా తినడం వలన మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయని నమ్మిక. పాలకూర టమాటాలో ఆక్సిలేట్ అనే పదార్థం ఉండటం వలన మూత్ర పిండాల్లో రాళ్ళు వస్తాయి. అంతేకాకుండా నీరు తక్కువ తాగే వారిలో కూడా మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది.
కొంతమందిలో ఈ రెండూ కలిపి తిన్న మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడక పోవచ్చు. ఇంకా బెండకాయ శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది అని మనందరికీ తెలిసిందే. బెండకాయ తిన్నప్పుడు కాకరకాయ తినకూడదు. రెండూ విరుద్ధ ఆహారాలుగా పని చేసి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. అలాగే బెండకాయ తిన్నప్పుడు ముల్లంగి కూర తినకూడదు. కొంతమంది రుచికోసం రెండు, మూడు కూరగాయలు కలిపి వంట చేస్తారు. ఇకపై అలా చేసేటప్పుడు అవి విరుద్ధ ఆహారాలు అవునా, కాదా గమనించండి. లేదంటే అనేక చర్మ సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలు లేదా ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది.