food-habits-for-healthy-life

కరోనా కాలం అందరూ తప్పక తీసుకోవాల్సిన ఆహారం ఇవేనండోయ్!!

అసలే ఇప్పుడు కరోనా  కాలం.చాలా మంది  కరోనా బారిన పడి  అధికంగా  ప్రాణాలు కోల్పోతున్నారు. కారోనా నీ ఎదుర్కోవాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మన శరీరంలో ముఖ్యంగా కావలసింది వ్యాధి నిరోధక శక్తి. అంటే మన శరీరంలో మనకి కావాల్సింది ఇమ్యూనిటీ పవర్ అన్నమాట, ఇప్పుడు మనం మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి  ఎలాంటి ఆహారం తీసుకుంటే  కరోనా మనని కబళించకుండా ఉంటుందో అందుకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఏం తింటే మంచిదో చూద్దాం.

పోషకాలు:

విటమిన్  ఏ, సి, డి  ఇ  ఉన్న ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ  రకమైన విటమిన్స్ ఏ ఆహారం లో ఉన్నాయో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సిట్రస్ జాతి పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. నిమ్మ, నారింజ, ఉసిరి, బెల్ పెప్పర్, ఫైనాఫిల్ ఇలాంటివి తీసుకుంటే మన శరీరంలో కణజాలం పెరగడంతో పాటు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు.

ఆమ్లా గా పిలిచే ఉసిరిలో ఎన్నో మంచి సుగుణాలు ఉన్నాయి నారింజ నిమ్మ లో కంటే కూడా 20 రెట్లు సి విటమిన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది . ఇందులో ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది.  జీవక్రియలను మెరుగుపరుస్తుంది. రోజు ఆమ్లా జ్యూస్  ఉదయాన్నే ఒక గ్లాసు తాగినా లేదు రోజు రెండు ఉసిరికాయలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది.

◆నారింజ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జలుబు దగ్గు అనేక అలర్జీల నుంచి కాపాడుతుంది. ఫ్రీరాడికల్స్ వల్ల వచ్చే నష్టం నుంచి శరీరంలో కణజాలాన్ని నారింజ సమర్థవంతంగా కాపాడుతుంది. ఈ పండు  కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది.

◆నిమ్మకాయ గురించి కొత్తగా చెప్పాల్సినది ఏముంది. అందరికీ తెలిసిన విషయలే, నిమ్మకాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలుసు. వీటిలో థియామిన్,  రిబోఫ్లేవిన్,విటమిన్ బి 6, రాగి మాంగనీస్. మెగ్నీషియం.  ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి రోజు నిమ్మ రసాన్ని  మన ఆహారంలో భాగం చేసుకోవాలి.

◆బెల్ పెప్పర్ గురించి తెలుసుకుందాం. మనం కాయగూరలు ఆకుకూరలులో సి విటమిన్ గురించి అస్సలు ఆలోచించము. వీటిలో సి విటమిన్ బీటా కెరొటిన్ కూడా అధికంగా ఉంటుంది ఇవి శరీర సహజ రక్షణ వ్యవస్థను దృఢంగా  ఏర్పరుస్తాయి. విటమిన్లు ఖనిజాలు ఎక్కువ, కంటి ఆరోగ్యం, చర్మ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి ఇవన్నీ విరివిగా దొరికే ఆహారం. మన రోజు వారీ ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

◆ఆఖరిగా పైనాపిల్ గురించి తెలుసుకుందాం. ఇందులో కూడా సి విటమిన్,  మాంగనీస్ అధికంగా ఉంటుంది. పైనాపిల్ తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది, కడుపులో మంట తగ్గుతుంది. ఇందులో  ఫైబర్ ఉంది రోజు పైన్ ఆపిల్ తీసుకోవడం వల్ల వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అదుపులో ఉంటాయి. పైనాపిల్ కూడా రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది.

చివరిగా…. 

మన ఆరోగ్యం బాగుండాలి మనలో రోగనిరోధక శక్తి పెరగాలి అంటే ఇవన్నీ తప్పనిసరిగా  మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనం రోగాలకు దూరంగా ఉండొచ్చు. ఇవే కాకుండా కరోనాకి మాస్కు శానిటైజర్ కూడా చాలా అవసరం. చాలా వరకు ఆహారాన్ని వేడివేడిగా తీసుకోవాలి. చల్లని కూల్ డ్రింక్స్, జ్యూస్ లు వీటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. వీటన్నింటినీ పాటించి మనం ఆరోగ్యంగా ఉంటూ అందర్నీ ఆరోగ్యంగా ఉండేలా చూద్దాం.

Leave a Comment

error: Content is protected !!