Food item you should not eat after expiration date

ఎక్స్పైర్ అయిపోయిన వీటిని తినడం ఎంత డేంజరో మీకు తెలుసా……

సూపర్ మార్కెట్ లలో, కిరాణా కొట్టులలో ప్రతి పదార్థం మీద ఎక్స్ఫైర్ డేట్ అని ఉంటుంది. అయితే చాలా మంది నెలకు సరిపడా సరుకులు తెచ్చిపెట్టుకుని వాడుతూ ఉంటారు. వీటిలో కొన్నిసార్లు కొన్ని పదార్థాలు ప్యాకేజీ మీద ఉన్న తేదీ దాటిపోయినా ఏమవుతుందిలే అని వాడేస్తూ ఉంటారు. అయితే ఇదంతా బిజినెస్ ట్రిక్ వాడితే ఏమవ్వదూ అనే మాబ్ మెంటాలిటీ అన్ని సందర్భాల్లో పనికిరాదు సుమా!!  మనం రోజువారి వాడుతున్న ఎన్నో పదార్థాలలో ఎక్స్ఫైర్ అయిపోగానే దూరంగా ఉంచడం మంచిదని నిపుణుల అభిప్రాయం. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన ఆ పదార్థాలు ఏమిటో చెప్పడమే ఈ వ్యాసం యొక్క సారాంశం.

    ఉదయం అన్నం  వండగానే రాత్రికే కాదు మరుసటి రోజుకు కూడా బాగుంటుంది. అయితే కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా వండినా రాత్రికల్లా చెడిపోయి మెత్తబడి పోతుంది. దీనిక్కారణం వండటంలో లోపం కావచ్చు, నిల్వచేయడంలో నిర్లక్ష్యం కావచ్చు, లేక వాతావరణం వల్ల తొందరగా పాడైపోయి ఉండవచ్చు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే, కొన్న పదార్థాలు డేట్ అయిపోవడం మాత్రమే కాదు మన జాగ్రత్త లేకపోతే కూడా పదార్థాలు తొందరగా పాడైపోతాయి. అయితే కొన్ని మన ప్రమేయం లేకుండా  స్వతహాగా విష స్వభావాన్ని నింపుకుంటాయి. వీటిని మాత్రం అస్సలు వాడకపోవడమే మంచిది. అవేంటో ఒక్కసారి చూద్దాం.

మాంసాహారం

రానురాను దేశంలో మాంసాహార ప్రియులు ఎక్కువైపోతున్నారు. ఒకప్పుడు  ఆదివారం వచ్చిందంటే మసాలా ఘుమఘుమలు లేనిది మనసొప్పదు వాళ్లకు  ఇపుడు మాత్రం నచ్చినపుడు కుమ్మేయడమే లక్ష్యంగా ఉన్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్నవాళ్లు అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని ఆస్వాదిస్తారు. అయితే ఇక్కడ జాగ్రత్త వహించాలి. నాన్ వెజ్ ఇంట్లో వండినా బయట నుండి ఆర్డర్ పెట్టుకుని తిన్నా అది ఫ్రెష్ గా ఉన్నపుడు తినడం ఉత్తమం. ఎక్కువైందనో, కాసింత మిగలగానే మళ్ళీ తిందామని కక్కుర్తి తో ఫ్రిజ్ లో పెట్టి బలవంతంగా వాటిని నిల్వ చేసుకుని 

 తరువాత మళ్ళీ వేడి చేసుకోవడం వల్ల వాటిలో ఉన్న బెనిఫిట్స్ నశించి విషపదార్థాలుగా మరే అవకాశం ఉంటుంది. చచ్చిన మనిషి ఒకరోజు తరువాత వాసన కొడుతుంటాడు, మరి ఈ నాన్ వెజ్ ఏమి దైవాంశం కాదుగా. కాబట్టి నాన్ వెజ్   దగ్గర గేమ్స్ పనికిరావు.

మెడిసిన్స్

సాదారణంగా ఆయుర్వేదంలో మందు ఎంత పాత బడితే అంత శక్తివంతమవుతుందని చెబుతుంటారు. అయితే  ఇంగ్లీష్ వైద్యంలో మాత్రం టాబ్లెట్లు, టానిక్ లు, ఇంజెక్షన్లు మొదలైనవి ఒక తేదీ దగ్గర ఇక  వాటిని పక్కన పెట్టేయాల్సి వస్తుంది. కొందరు ఏమి కాదనే నిర్లక్ష్యం తో వాడేస్తుంటారు. అయితే మందుల తయారీలో ఉపయోగించే రసాయనాలు మరియు రోగనిరోధక సమ్మేళనాలు ఒక పరిధి దాటిపోయాక వాటి శక్తిని కోల్పోతాయి. ఇలాంటి పదార్థాలు ఆరోగ్యాన్ని బాగు చేయకపోగా  సమస్యను ఉదృతం చేయడం లేదా కొత్త సమస్యలు సృష్టించడం జరుగుతుంది.

ప్యాకింగ్ చేసిన ఫుడ్స్( ఇన్స్టంట్ ఫుడ్స్)

ప్యాకింగ్ చేసిన చిప్స్, స్నాక్స్ లాంటివి నిల్వ ఉండటానికి  ఉపయోగించే నైట్రోజన్ వల్ల వాటిని నిర్ధేశించిన పరిధి తరువాత తింటే అస్వస్థతకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్యాక్ చేసిన స్వీట్లు, తినుబండారాలు, ఇన్స్టంట్ ఫుడ్స్ గా అమ్మే ప్యాకెట్లు నిర్ణీత సమయాల్లో వాడుకోవడం ఉత్తమం.

నూనెలు

గానుగ నూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అయితే రిఫైండ్ చేసిన నూనెలలో రసాయనాల వల్ల నూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉంచినా వాసన వస్తాయి వీటిని మనం రోజువారీ ఆహారంలో వాడతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

బేకరీ లో తయారు చేసే పదార్థాలు

బ్రెడ్, బర్గర్, పిజ్జా లు, కేక్ లు  మొదలైన వాటిని తినడమే ఆరోగ్యానికి మంచిది కాదని వీటిలో మైదా హానికరం అని చెబుతారు. అటువంటిది ఇక వీటిని నిల్వ చేసుకుని మరీ తినడం అంటే అడ్డంగా అనారోగ్యానికి టికెట్ బుక్ చేసుకున్నట్టే

పాలు వాటి పదార్థాలు

నెయ్యి అయితే నిల్వ ఉంటుంది కానీ, పాలు, క్రీమ్, జున్ను, వెన్న, పనీర్, చీజ్ లాంటివి ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదు.

మొలకెత్తిన గింజలు

చాలామందికి తెలుసు  మొలకెత్తిన గింజలు ఎంతో ఆరోగ్యమని. అయితే వీటిని మొలకలు వచ్చాక రెండు మూడు రోజులు మించి నిల్వ ఉంచితే ఈకోలి అనే బాక్టీరియా చేరి విషపదార్థాన్ని తయారుచేస్తాయి. కాబట్టి జాగ్రత్త 

చివరగా……

పదార్థం ఏదైనా తాజాగా ఉన్నపుడు తీసుకోవడమే సంపూర్ణ ఆరోగ్యమని గుర్తుంచుకోండి. ఏ పదార్థం మీద అయినా బూజు రావడం, వాసన రావడం జరిగితే మరో ఆలోచన లేకుండా పడేయడం ఉత్తమం.  నేటి కృత్రిమ రంగులు రసాయనాల మయమైన ఆహారపు చక్రంలో నిల్వ మంచిది కాదు సుమా…!!

Leave a Comment

error: Content is protected !!