food items we should avoid with Blood Pressure

బిపి ఉన్న వాళ్ళు ఇవి మానేయాల్సిందే… లేకపోతే ముప్పు కొనితెచ్చుకున్నట్లే ..

ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లొ బిపి పేషెంట్ లు తప్పనిసరిగా ఉంటారు. వారితో వచ్చే సమస్యలు అంతా ఇంతా కాదు. ఎపుడు కోపంగా ఉంటారో ఎపుడు ప్రశాంతంగా ఉంటారో చెప్పలేని పరిస్థితులు నెలకొంటాయి. ఇది మొత్తం ఎందువల్ల అంటే తీసుకునే ఆహారం వల్లనే అనే విషయం అందరికి తెలుసు. అయితే బిపి కంట్రోల్ లో ఉండటానికి టిఫిన్లు, భోజనం చేయగానే ఒక టాబ్లెట్ మింగేసి తమమానాన తాము తినేస్తూ ఉంటారు. దీర్ఘకాలికంగా ఎన్నేళ్ళు టాబ్లెట్స్ వాడతారు అంటే చెప్పలేరు అది అంతిమ శ్వాశ వరకు కావచ్చు. కానీ కొన్ని ఆహారపదార్థాలను దూరంగా ఉంచడం వల్ల బిపి టాబ్లెట్ లు మింగకుండానే బిపి కి చెక్ పెట్టవచ్చు. మరి బిపి కంట్రోల్ లో ఉండటానికి దూరం పెట్టాల్సినవి ఏమిటో ఒకసారి చూద్దాం.

◆బిపి అనగానే గుర్తొచ్చేది ఉప్పు. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఉప్పను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ ను పెంచుతుంది. ఇది అలాగే కొనసాగితే రక్త ప్రసరణ వ్యవస్థ గుండె పనితీరును దెబ్బతీస్తుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీనివల్ల టెన్షన్, మానసిక ఆందోళన లాంటివి అసందర్బంగా వచ్చి చేరతాయి.  అందుకే  ఉప్పు వాడకాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని చెబుతారు.

◆చాలామంది మగవాళ్ళలో ధూమపానం, మధ్యపానం అలవాట్లు ఉంటాయి. వీరిలో సాధారణ సమయం కంటే ధూమపానం, మద్యపానం తీసుకున్నప్పుడు రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. అలాగే మద్యపానం లో ఉన్నపుడు ఆల్కహాల్ తో కలిపి తినే పదార్థాల వల్ల ఈ రక్త ప్రసరణ వేగం ఇంకా పెరుగుతుంది. దీనివల్ల చాలా మంది మద్యం సేవించినపుడు అర్థాంతరంగా హార్ట్ ఫెయిల్ అయి చనిపోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. కాబట్టి బిపి సమస్య ఉన్నవారు ధూమపానం, మద్యపానం కు దూరంగా ఉండాల్సిందే.

◆కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్స్ లో రసాయనాలు కృత్రిమ  పదార్థాలు ఉపయోగిస్తారు  రుచి కోసం. వీటి వల్ల రక్తంలో ఆరోగ్యకరమైన ఆక్సిజన్ కలుషితమై శరీరంలో రక్తాన్ని మలినం చేస్తుంది. అంతేకాదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహారం తయారు చేసేటపుడు నిల్వ ఉంచిన పదార్థాలను వాడుతుంటారు. ముఖ్యంగా నూనెను మళ్ళీ మళ్ళీ మరిగిస్తూ విషతుల్యం చేస్తారు. వీటిలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అందుకే బయట ఆహారానికి దూరంగా ఉండటం మంచిది

◆వేసవి వచ్చిందంటే ప్రతి ఇల్లు పచ్చళ్ళ ఘుమఘుమలతో అధిరిపోతుంది. అయితే పచ్చళ్ళు నిల్వ ఉండాలి అంటే అందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉండాలి. అందుకే పచ్చళ్ళను తీసుకోవద్దని వైద్యులు కూడా సూచిస్తారు. బిపి కంట్రోల్ లో ఉండాలంటే మరొమాటకు తావు లేకుండా పచ్చళ్ళను మెనూ నుండి బహిష్కరించాల్సిందే.

◆సాయంత్రం అవ్వగానే చిరుతిల్లు తినడం అందరికి అలవాటు. అయితే వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయడం, మసాలా దినుసులు, ఉప్పు వంటివి ఎక్కువ జోడించినవే అయి ఉంటాయి కాబట్టి వీటిని కూడా దూరం పెట్టాల్సిందే

◆బిస్కెట్లు, సోడా లలో ఉప్పు అధికంగా వాడతారు. తియ్యని బిస్కెట్లలో అయినా అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండటం మరియు అందులో కూడా లైట్ గా ఉప్పును జోడించడం జరుగుతుంది అందుకే  బేక్ చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి

చివరగా……

బిపి నియంత్రణ అనేది కేవలం టాబ్లెట్ వేసుకుని అదుపులో ఉంచుకునేది కాదు. పైన సూచించిన ఆహారపదార్థాలను దూరంగా ఉంచుతూ అనవసరమైన విషయాల గూర్చి ఆలోచించకుండా, మానసిక ఆందోళనకు దూరంగా ఉంటూ తీసుకునే జాగ్రత్తలే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అనే విషయం మరువకూడదు.

2 thoughts on “బిపి ఉన్న వాళ్ళు ఇవి మానేయాల్సిందే… లేకపోతే ముప్పు కొనితెచ్చుకున్నట్లే ..”

  1. Bp గురించి మంచి సమాచారం అందించారు .మీకు ధన్యవాదాలు.

    Reply

Leave a Comment

error: Content is protected !!