food items will create problems for our health

మనం తీసుకునే ఆహారంలో మనకు అపకారం కలిగిస్తున్నవి ఇవే…..

రోజులో మనము ఎంతో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఒకోరికి ఒకో ఆహారపు అలవాటు ఉంటుంది. ఈ అలవాట్లలో విభిన్న రకాల ఆహారపదార్థాలు ఉంటాయి.  అయితే చాలా మంది ఆహారం తీసుకునే విఆహాయం కొన్ని నిజాలు తెలియకుండా ఆరోగ్యమే అనుకుంటూ కొన్ని పదార్థాలు తినేస్తుంటారు. అలాటి వాళ్ళు ఒకసారి ఇది చదివితే నిజానిజాలు తెలుసుకుంటే ఆరోగ్యం విషయం లో సగం విజయం సాదించినట్టే. అయితే అవేంటో చూడాల్సిందే మరి.

◆ చాలామంది ఆరోగ్య స్పృహ అనే  పేరుతో ఎక్కువగా తినే ఆహారం సలాడ్. వెజిటబుల్ సలాడ్ అని పిలువబడే పచ్చి కూరగాయలను పుష్టిగా బోజనమ్ తినేసాక అవి జీర్ణమవ్వాలనే ఉద్దేశంతో తింటూ ఉంటారు. అయితే ఇది చాలా తప్పు. వెజిటబుల్ సలాడ్ లు ఆహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకుంటేనే ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలా కాకుండా వండిన ఆహారం బాగా తిన్నాక ఈ పచ్చి కూరగాయల సలాడ్ తినడం వల్ల ఆహారం గందరగోళం అవుతుంది.

◆ పళ్ళు, కూరగాయల ముక్కలతో సలాడ్ చేసుకునేవారు వాటిమీద ధనియాలు పొడి, జీలకర్ర పొడి లేదా మిరియాల పొడి చల్లుకుని తింటే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.

◆ అదనంగా ఆహారపదార్థాలలో ఉప్పు కలుపుకోవడం చాలా మంది అలవాటు. కనీసం పెరుగన్నంలో అయినా ఉప్పు కలుపుకుంటూ ఉంటారు. పెరుగన్నం లేదా మజ్జిగ అన్నంలో  జీలకర్ర పొడి లేదా వాము పొడిని కలిపి తింటే అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. అలాగే గొప్ప జీర్ణశక్తిని చేకూరుస్తుంది కూడా.

◆ అనారోగ్యం చేసిన వారు మరియు అలాటి సూచనలు ఉన్నవారు ముఖ్యంగా మూడు పదార్థాలకు దూరంగా ఉండాలి.  వాటిలో మొదటిది చింతపండు, రెండవది శనగపిండి, మూడవది నూనె. ఈ మూడింటిని మీ ఆహారం నుండి తప్పిస్తే అనారోగ్య ఛాయలు మెల్లిగా తగ్గుతాయి.

◆  తీసుకునే ఆహారాలలో ఫైబర్, కాల్షియం, ప్రోటీన్, మినరల్స్ మొదలైన వాటితో నిండి ఉండేలా జాగ్రత్తపడాలి.  ఉప్పు, కారం, మసాలాలు, కొవ్వు పదార్థాలు కలిగి ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి.

◆ పళ్ళు, కూరగాయలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. రోగ నిరోధకశక్తిని పెంపొందించే బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి.

◆ ధనియాలు, జీలకర్ర, మెంతులు, గసగసాలు, దాల్చిన చెక్క, ఏలకులు, వాము వంటి గరం మసాలాలో ఉపయోగించే పదర్గాలు మేలు చేసే గుణాన్ని కలిగి ఉన్న, వీటిని వాడే పద్దతిలో అధికంగా నూనెలు మరియు మాసాలలో కలిపి వాడటం వల్ల సువాసన మినహా ప్రయోజనాలు శూన్యమవుతున్నాయి.

◆ తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు మొదలగు ఆరు రుచులూ సమాన పాళ్లలో  ఉన్నపుడే ఆబోజనం సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. కొన్నింటిని మాత్రమే ఎక్కువ తీసుకుని మరికొన్నిటిని తక్కువ వాడటం లేదా అసలు వాడకుండా ఉండటం వల్ల ప్రయోజనాలు శూన్యం.

◆ అన్నిటికన్నా ముఖ్యమైన అంశం శరీరానికి శ్రమ ఉన్న వ్యక్తులు ఏది తిన్నా  అరిగించుకోగలరు, కాబట్టి శారీరక వ్యాయామం లేనివాళ్ళు రుచుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

◆ అందరి ఆరోగ్యం ఒకే విధంగా ఎలాగైతే ఉండదో తీసుకోవలసిన ఆహార విషయంలో కూడా అంతే ఒకే విధంగా ఉండదు. ఎవరి శారీరక సామర్థ్యము మరియు, జీర్ణ శక్తి, శరీరతత్వాన్ని బట్టి వెతికి తగిన ఆహారం ఎంపిక చేసుకుని అనుసరించాలి.

చివరగా……

ఆహారం అనేది ఆరోగ్యాన్ని చేకూర్చాలే కానీ, ఆరోగ్యాన్ని దిగజార్చే విధంగా ఉండకూడదు కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తలే ఆరోగ్యమే మహాభాగ్యమనే విషయాన్ని నిజం చేస్తాయి.

Leave a Comment

error: Content is protected !!