Foods That Give You Energy

మంచం మీద ఉన్న వారిని సైతం లేచి నడిచేలా చేస్తుంది

ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల ప్రతి ఒక్కరికి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కాళ్లు నొప్పులు వంటివి  చాలా విపరీతంగా ఉంటున్నాయి. వాటిని  తగ్గించుకోవడం కోసం ప్రతి ఒక్కరు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. కానీ ఇంగ్లీషు  మందులు ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే నాచురల్  చిట్కాలను ఉపయోగించడం వల్ల కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. 

       దీనికోసం ముందుగా  మిక్సీ జార్  తీసుకొని అందులో రెండు చెంచాల  అవిస గింజలు వేసుకోవాలి. అవిసెగింజలలో ఉండే ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ మోకాళ్ళ,  నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళనొప్పులు వంటి అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. ఒక చెంచా మెంతులు వేసుకోవాలి. మెంతులు  ఆంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి  ఉంటాయి. ఇవి  శరీరంలోని నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి.   ఈ రెండింటిని కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత  ఈ పొడిలో రెండు చెంచాల ఉసిరికాయ పొడి వేసి బాగా కలుపుకోవాలి. 

        ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని దీనిలో ఒక గ్రామ్  కలా  గొంధ్  వేసి అది కరిగేవరకు బాగా కలుపుకోవాలి. ఇది మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇది  బంక  లాగా ఉంటుంది. శరీరంలో అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.  మనం  నీటిలో వేసిన గొంధ్  కరిగిన తర్వాత మనం ముందుగా  తయారుచేసిన పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి ఈ నీటిని రోజూ ఉదయాన్నే   భోజనం చేయడానికి ముందు తీసుకోవాలి. ఇలా వరుసగా కొద్దిరోజుల పాటు తీసుకోవడం వలన శరీరంలో అన్ని రకాల నొప్పులు  తగ్గుతాయి.

          మంచం మీద నుంచి లేవలేని వారు కూడా లేచి నడుస్తారు. ఈ చిట్కా చేయడంలో ఉపయోగించినవన్నీ నేచురల్ పదార్ధాలు. కాబట్టి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని  శరీరంలో ఏ  రకమైన నొప్పి అయినా  తగ్గించుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇంగ్లీష్ మందులు వాడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్నవారు ఒకసారి  ఈ చిట్కా ట్రై చేసి చూడండి. శరీరంలో వచ్చే ఎటువంటి నొప్పి నుండి అయినా  ఉపశమనం పొందవచ్చు.  దీనితో పాటు మన ఆహారపు అలవాట్లు మరియు జీవన విధానంలో కూడా కొన్ని మార్పులను చేసుకోవాలి. ఈ  డ్రింక్ తాగుతూ  ఈ నియమాలు పాటించినట్లయితే  శరీరంలో వచ్చే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.

1 thought on “మంచం మీద ఉన్న వారిని సైతం లేచి నడిచేలా చేస్తుంది”

Leave a Comment

error: Content is protected !!