Foods that lower blood sugar instantly

షుగర్ ఉన్న వారికి ఒళ్ళు గగుర్లు తెప్పించే సీక్రెట్……

చాలామందికి రక్తంలో చక్కెర స్థాయిలో ఉండవలసిన నార్మల్ లెవల్ కంటే ఫాస్టింగ్ లో 120 కంటే 140,150, 200 వరకు ఉంటాయి. కొంతమంది భోజనం చేసిన రెండు గంటల తర్వాత చూస్తే 200, 240… మెయింటైన్ అవుతుంది. మూడు నెలల తర్వాత డయాబెటిస్  చూస్తే HbA1c 8,10,12 ఇట్లా కూడా ఉంటుంది. అన్ కంట్రోల్ షుగర్ వల్ల డయాబెటిస్ ఉన్నవారికి కొన్ని సంవత్సరాలు గడిచేకొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇతర అవయవాల్లో వస్తాయి. ఆడవారిలో ముఖ్యంగా ఓవరీస్లో నీటి బుడగలు బ్లడ్ షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల తయారవుతాయి. 

            హార్మోన్స్ లో చేంజ్ వల్ల పీరియడ్స్ సరిగా రాకపోవడం ప్రెగ్నెన్సీ  రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. బ్లడ్ లో చక్కెర స్థాయి ఎక్కువ అవ్వడం వల్ల రక్తం చిక్కు బడి రక్త ప్రసరణ తగ్గుతుంది. అంతేకాకుండా అన్ కంట్రోల్ డయాబెటిస్ వల్ల బ్రెయిన్ లో ఆల్జీమర్స్, డిమాండ్షియా, పార్కింగ్ సెన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. డయాబెటిస్ వల్ల కంటిచూపు కూడా దెబ్బతింటుంది. కంట్లో నరాలు అతి సూక్ష్మంగా ఉండడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక కంట్లో రెటీనా దెబ్బతింటుంది. దీనివల్ల చూపు మందగిస్తుంది.

        అన్ కంట్రోల్ డయాబెటిస్ వల్ల కిడ్నీలో ప్రధానంగా ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే బ్లడ్ లో ఎక్కువ చక్కెరనీ ఫిల్టర్ చేయడం వల్ల  రీ అబ్సెప్షన్ కెపాసిటీ తగ్గుతుంది. రక్తప్రసరణ కిడ్నీలకు వెళ్ళేది తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, డయాబెటిస్ ఉన్నవాళ్లలో గాల్బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి, బ్లడ్ లో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడంతోపాటు, గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నరాల మంటలు దీనికి కారణం డయాబెటిస్ ఉన్నవాళ్లలో B12 విటమిన్ సరిగా లేకపోవడం, నరాల పైనుండే మైలిన్ పోరా దెబ్బతింటుంది. అందుకే నరాల్లో మంటలు వస్తాయి.

శరీరంలో ఉన్న రక్తనాళాల్లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల గోడలు మందంగా తయారవుతాయి. దీనివల్ల రక్తం చిక్కబడుతుంది. దీనివల్ల రక్తప్రసరణ తగ్గి హై బీపీ పెరుగుతుంది. బ్లడ్ లో pH లెవెల్స్ పెరిగిపోతుంది దీనిని ఎముకలలో ఉండే కాలుష్యం వచ్చి న్యూటలైజ్ చేయడం వల్ల ఆస్ట్రోపోరోసిస్ రావడం జరుగుతుంది. దీని వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దంతాల సమస్యలు యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తాయి. షుగర్ లెవెల్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ ద్వారా గాని లేదా డైట్ హాబిట్స్ తో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఫాస్టింగ్ లో 110 కి మించి ఉండకూడదు, పోస్ట్ లంచ్ లో 160- 170 మధ్యలోఉండాలి.

Leave a Comment

error: Content is protected !!