Foods that make you poop immediately

మోషన్ ని అతి స్పీడ్గా జాడి పడేసేది సంవత్సరాలుగా ఉన్న మలబద్ధకం సెకండ్స్ లో మాయం

సుఖ విరోచనం జరగాలంటే, తాడులా ఒకేసారి మలం మొత్తం జాడించి బయటకు రావాలంటే మన ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికీ సుఖ విరోచనం జరగాలని కోరిక ఉంటుంది. కానీ వందలో అరవై శాతం మందికి మలం గట్టిపడి విరోచనము అవడం కష్టం అవుతుంటుంది. మలంలో రక్తం పడటం, నొప్పి, మంట వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే పైల్స్ వంటి సమస్యలకు కారణమవుతాయి. అందుకే మనం తినే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల సుఖ విరోచనం అవ్వటంతో పాటు గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. దీని కోసం మనం ఆహారంలో తీసుకోవలసిన కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 లేతగా ఉండే సొరకాయలు తీసుకోవాలి. కొంచెం కూడా ముదురినవి వద్దు. లేతగా గిచ్చితే గోరు దిగేలా  ఉండాలి. అలాంటి సొరకాయ, బీరకాయ, దోసకాయలను పైన పొట్టు తీయకుండా తొక్కతో సహా  పులుసు, కూర ఇగురు చేసుకుని తినాలి. వీటి తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలం చిక్కబడకుండా  సులభంగా ప్రేగులలో కదలికలు జరగడానికి సహాయపడుతుంది. అందుకే బీరకాయ, సొరకాయ, దోసకాయపైన ఉండే ఈనెలు కానీ గింజలు కానీ తీయకుండా వండుకుని తినాలి. మనం తినే ఆహారంలో జీర్ణంకాని ఫైబర్ ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలలో పండ్లు కూడా కొన్ని ఉన్నాయి.

 కమలాపండ్లు పైన తెల్లటి ఈనెలు ఉంటాయి. మనం వీటిని తీసేసి పండ్లు తింటూ ఉంటాం. కానీ వీటిని తియ్యకుండా తొనలుతో సహా నమిలి మింగేయాలి. ఇవి జీర్ణం కాకుండా మలంతో పాటు బయటకు రావడానికి సహాయపడతాయి. దానిమ్మ గింజలను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిలో ఉండే చిన్న విత్తనం ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి, మలం సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది. మిల్లెట్స్ కూడా ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. మిల్లెట్స్ ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఈ సీజన్లో తేగలు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని తీసుకోవడం వలన ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కూడా సుఖ విరేచనానికి సహాయపడుతుంది. వీటన్నింటితోపాటు రోజు ఉదయాన్నే లీటర్ పావు గోరువెచ్చని నీటిని తాగి మనసుని విరోచనం అవడం పై పెట్టి ఉన్నారంటే ప్రతిరోజు సుఖ విరోచనం అవుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడటానికి సుఖ విరోచనం అనేది ప్రధాన కారణం.

Leave a Comment

error: Content is protected !!