Foods to Boost Memory Power Improves Strength

20 రూపాయలు వజ్రం! దీన్ని ఎంత తింటే అంత బలం. మేధస్సు, తెలివితేటలు పెరుగుతాయి…

ప్రతి మనిషికి మెదడు అనేది ఉంటుంది ఆలోచనలు వస్తాయి. అందరికీ ఏకాగ్రత అనేది ఉంటుంది. ఏకాగ్రత లేకుండా పుట్టుకతో లోపం అనేది ఏమీ ఉండదు. ఇష్టాలు, అయిష్టాలు అనే దాన్నిబట్టి ఏకాగ్రత నిలవడం లేకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. కొందరికి చదవడం ఇష్టం, కొందరికి ఆడుకోవడం ఇష్టం, మరి కొంతమందికి సినిమాలు అంటే ఇష్టం. వాళ్లకు ఇష్టమైన పని చేసేదాన్ని బట్టి వాళ్లకి ఏకాగ్రత అనేది నిలకడగా ఉంటుంది. వాళ్లకు ఇష్టమైన పని చేసినప్పుడు చాలా శ్రద్ధ ఉంటుంది వాళ్లకి ఆ సమయంలో నిద్ర కూడా రాదు ఏకాగ్రతతో పనిచేస్తారు. మనిషికి వ్యాయామం అనేది చాలా అవసరం అది లేకపోతే బద్ధకం వస్తుంది.

            ఏకాగ్రత లేని వ్యక్తికి ఆవలింతలు ఎక్కువ వస్తాయి. ఆవలింతలు ఎందుకు వస్తాయి అంటే మన బ్రెయిన్ వెడేక్కినప్పుడు దాన్ని చల్లార్చడానికి ప్రాణవాయువు ఎక్కువ కావాలి, అంతేకాకుండా ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. ప్రాణాయామం, వ్యాయామం, ఆసనాలు ఇలాంటివి చేయడం ద్వారా రక్తప్రసరణ శరీరంలో బాగా చురుకుగా జరగటంతో పాటు మెదడు కణాలకు చేరుతుంది. దీనివల్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఇలా చురుగ్గా బ్రెయిన్ పనిచేయడానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. దీనికి తోడు ధ్యానం కూడా బాగా ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది.

           నిద్రకి ఏకాగ్రతకు కూడా సంబంధం ఉంటుంది ఎంత ఎక్కువ నిద్రపోతే అంత ఎక్కువ ఏకాగ్రత అనేది వస్తుంది. నిద్ర సరిగా లేకపోతే మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉండదు. ఎందుకంటే మెదడు పని చేసినప్పుడు మెదడు లోనే కణజలమంతా కూడా వ్యర్ధాలను విడుదల చేస్తాయి. ఎప్పుడైతే మనం నిద్రపోతామో అప్పుడు మెదడు కణాలు రిలాక్స్ అవుతాయి. కొత్తగా వ్యర్ధాలు తయారు కావు పాత వ్యర్ధాలు అన్ని నైట్ టైం రెస్ట్ లో  శరీరం క్లీనింగ్ మెకానిజం స్టార్ట్  చేస్తుంది కాబట్టి బ్రెయిన్ సెల్స్ ని ఉదయానికల్లా రీఛార్జ్ చేసి పెడుతుంది. మనం తినే ఆహారం బట్టి కూడా ఏకాగ్రత అనేది ఆధారపడి ఉంటుంది. 

       ఉడికిన ఆహారం, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఏకాగ్రత అనేది వస్తుంది. నట్స్, సలాడ్స్, జ్యూస్ లు లాంటి నాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ అనేది చురుగ్గా పనిచేస్తుంది.ఇలా ఫ్రెష్ ఫుడ్ తినడం వల్ల బ్రెయిన్ లో ఏకాగ్రత పెరిగి వర్క్ చేయడానికి సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!