Foods to Build Strength Diet Plan for Painters

హై ప్రోటీన్ ఉన్న వీటిని తింటే మీ శరీరం ఉక్కు లాగా మారుతుంది……. రోజంతా బలంగా ఉంటారు…… పెయింటర్స్ తీసుకోవాల్సిన ఆహారపు నియమాలు……

పెయింటర్స్ ఎక్కువగా గోడల్ని రబ్ చేయడానికి రబ్ పేపర్స్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా రాఫీంగ్ పని చేస్తు ఉండడం వలన దాని యొక్క దుమ్ము ఊపిరితిత్తులకు పట్టేస్తూ ఉంటుంది. అందరికంటే ఎక్కువగా వీరికే ఊపిరితిత్తుల ప్రాబ్లమ్ ఉంటుంది. వీరికి కంటిన్యూస్గా చేతులతోనే పని ఉంటుంది. చేతుల నొప్పులు, మెడ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. మరియు నిచ్చెన మీద నించోవడం వల్ల కాళ్ళు నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే కెమికల్స్ కూడా లోపలికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వీటినుంచి రక్షణ పొందవచ్చు.

                        వీరు కష్టపడి పని చేసేవారు కాబట్టి మూడు పూటలా భోజనం చేసే అర్హత ఉంటుంది. వీరి చేతులకు కండబలం ఎక్కువగా ఉండాలి. అంటే మాంసకృత్తులు ఎక్కువగా గల ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ శక్తి కావాలి కనుక పిండి పదార్థాలు మరియు కొవ్వులు ఎక్కువగా గల ఆహారం తీసుకోవాలి. వీరు తెల్లటి బియ్యం మానేసి పాలిష్ పట్టిన ధాన్యాలు ఉపయోగించుకోవడం మంచిది. వేరుశనగ పప్పులు వీరు నానబెట్టి కూరల్లో వాటిల్లో ఉపయోగించడం చాలా మంచిది. కూరల్లో ఎక్కువగా మీల్ మేకర్ వాడుకోవడం మంచిది.

                       కూరల్లో నూనె, కారం, ఉప్పు తగ్గించుకోవడం మంచిది. అన్నము 70% కూరలు 30% ఉంటే మంచిది. సాయంత్రం పూట వీరు ఉడికిన ఆహారం తినేటప్పుడు భోజనానికి ముందు జామకాయలు రెండు తింటే చాలా మంచిది. భోజనంతోపాటు రెండు అరటిపళ్ళు కూడా తినవచ్చు. వీరు ఎక్కువగా ఎండలో ఉండాలి కనుక ఐదు లీటర్ల నీరు వరకు తాగుతూ ఉండాలి. మూడు పూటలా ఈ విధంగా ఆహారం తీసుకోవడం వలన వీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆకుకూరలు రోజు ఆహారంలో చేసుకోగలిగితే రక్తం బాగా పెరుగుతుంది.

                       ఇటువంటి ఆహార నియమాలతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుంటే వీరు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. నిచ్చెన సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. మరియు పేపర్ కొట్టేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలి. రఫ్ చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవడం మంచిది. దీని ద్వారా అరిచేతులు పగిలిపోకుండా ఉంటాయి. పైనుంచి వేలడుతు చేసేటప్పుడు సేఫ్టీ బేల్ట్ పెట్టుకోవడం మంచిది. దాన్ని ఎక్కడుంటే అక్కడ తగిలించుకోవాలి. దీని ద్వారా అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలు తప్పించుకోవచ్చు. చేతులకు కొబ్బరి నూనెలో పెప్పర్మెంట్ ఆయిల్ కలిపి రాసుకోవడం కూడా మంచిది

Leave a Comment

error: Content is protected !!