మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మైనింగ్ వర్క్స్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఓపెన్ కాస్ట్ మైన్స్, అండర్ గ్రౌండ్ మైన్స్. సమస్యలు ఎక్కువగా చూస్తే అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. గుహల్లాగ గాలి ఆడని ప్రదేశంలో ఎక్కువ గంటలు పని చేయవలసి వస్తుంది. దీనివల్ల వాళ్లకి ఆక్సిజన్ సరిగ్గా ఉండదు. బ్రెయిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డస్ట్ కూడా లంగ్స్ లోకి ఎక్కువ వెళ్లిపోతుంది. వీళ్ళకి లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం, సి ఓ పి డి సమస్యలు, న్యూమోనియా రావడం వంటి సమస్యలు, దగ్గు రావడం ఎక్కువగా ఉంటాయి.
వీళ్ళు బరువు పనులు ఎక్కువ చేస్తుంటారు. అందువల్ల నడుం నొప్పి, కాళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. వీళ్ళు ఎక్కువ గంటలు నిలబడి పనిచేయడం వల్ల కూడా ఇలా అవుతుంది. ఈ మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఇవి తింటే ఎక్కువ గంటలు యాక్టివ్ గా ఉండి పని చేయగలుగుతారు. అందుకని వీళ్లకు రోజుకి ఒక కొబ్బరి చెక్క, నానబెట్టిన వేరుశనగ గుళ్ళు,10-15 ఖర్జూరాలు వీటితోపాటు రెండు జామకాయలు, ఒకటి రెండు అరటిపళ్ళు తినాలి. ఇలా చేస్తే దీర్ఘ రోగాలు రాకుండా ఇది సపోర్ట్ చేస్తుంది. మైన్స్ లో వర్క్ చేసేటప్పుడు నీళ్ల బోటెల్ దగ్గర ఉంచుకుని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే త్వరగా యూరిన్ రాదు.
ముక్కు ద్వారా దుమ్ము ధూళి లోపలికి వెళ్లకుండా వెంట్రుకలు అడ్డుకుంటాయి. ఇవి ఫిల్టర్స్ గా పని చేస్తాయి. ముక్కులో ప్రతిరోజు వాటర్ పోసి క్లీన్ చేయాలి. ఇలా చేస్తే డస్ట్ అంతా బయటికి వెళ్లిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్లలో కొంచెం పసుపు వేసి జలనేతి చేసేస్తే ముక్కు రంధ్రాల్లో ఉన్న డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ప్రాణాయామం చేస్తే లంగ్స్ అంతా శుభ్రం అవుతాయి. ఇలా ప్రాణాయామం చేస్తే కూడా చాలా మంచిది. వీళ్ళు ముఖ్యంగా గోళ్ళను అసలు పెంచకూడదు. ఎందుకంటే ఈ బొగ్గు అంతా గోలల్లోకి వెళ్లి అలానే ఉండిపోయి ఆహారం ద్వారా లోపలికి వెళ్లిపోతాయి. బొగ్గు పనులు చేసేటప్పుడు గ్లౌజెస్ వేసుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి.
వీళ్ళు కనీసం ఒక ఏడు గంటలైనా తప్పనిసరిగా నిద్రపోవాలి.