బరువు తగ్గాలి అనుకునేవారు, మధుమేహం ఉన్నవారు రాత్రుళ్లు అన్నం తినడం మానేసి చపాతీలు, పుల్కాలు తినడం అలవాటు చేసుకున్నారు. అన్నం తినడం వలన 500 కేలరీలు లభిస్తాయి. కానీ రెండు లేదా మూడు చపాతీలు తినడం వలన 150 నుండి 250 క్యాలరీలు లభిస్తాయి.చపాతీలు లేదా పుల్కాలు తినడం వలన బరువు తగ్గడానికి మరియు మధుమేహం ఉన్నవారికి కొంతవరకు లాభమే కానీ వీటి వలన కూడా కేలరీలు లభిస్తున్నాయి.
బరువు తగ్గాలి అనుకునే వారికి దీనికి మించిన మరో మార్గం ఉంది. అదే రాత్రిపూట అన్నానికి చపాతీలకు బదులు పండ్లను తినడం వలన కేలరీలు ఉండవు. శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. నీటిశాతం సమకూరుతుంది. మంచి నిద్ర పడుతుంది. శరీరానికి ఎక్కువ సేపు జీర్ణం చేయాల్సిన అవసరం లేకుండా విశ్రాంతి లభిస్తుంది. రక్తంలో మలినాలను తొలగించి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
దాని వలన ఉదయాన్నే మరింత తాజాగా రోజును ప్రారంభించవచ్చు. క్యాలరీలు తక్కువగా లభించడం వలన బరువు పెరగరు. శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలు కరగడానికి అవకాశం ఏర్పడుతుంది. మధుమేహం ఉన్నవారు కేవలం పండ్లు కాకుండా కొన్ని బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ నానబెట్టి అవి గుప్పెడు తిన్న తరువాత పండ్లు తినడం వలన శరీరం నేరుగా పండ్లను జీర్ణం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.
దీనివలన మధుమేహం ఉన్నవారికి కూడా అనేక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు 7 గంటల లోపు భోజనం ముగించాలంటే తప్పకుండా ఇంటికి రావాల్సి ఉంటుంది. కానీ చపాతీలు, పుల్కాలు కాకుండా పండ్లు తినడం వారైతే ఎక్కడైనా తినవచ్చు. ఉద్యోగ సమయంలో ఉండగానే ఈ పండ్లను తింటే ఆ రోజు సాయంత్రం భోజనం చేయవచ్చు. ఇలా చేయడం వలన త్వరగా భోజనం ముగించి శరీరానికి విశ్రాంతి ఇవ్వవచ్చు.
భోజనాన్ని త్వరగా ముగించడం వలన పడుకోవడానికి ముందే ఆహారం జీర్ణమవడం మొదలవుతుంది. కనుక శరీరంలో కొవ్వు పేరుకోవడం సమస్య ఉండదు. బరువు తగ్గాలి అనుకునేవారికి పండ్లు అద్భుతమైన వరం. అందుకే త్వరగా బరువు తగ్గడానికి పండ్లను రాత్రి భోజనంగా మార్చుకోండి.