Full Body Whitening Bath Powder

ఈ బాత్ పౌడర్ ఉపయోగించినట్లయితే చర్మం తెల్లగా మెరిసిపోతుంది

ప్రస్తుతం అందరూ తెల్లగా ఉండాలి అందంగా ఉండాలి అని మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా కెమికల్స్ ఉండటం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు స్కిన్ తెల్లగా మెరిసిపోవాలంటే ఒకసారి ఈ బాత్ పౌడర్ ను ట్రై చేసి చూడండి .మంచి రిజల్ట్ ఉంటుంది .దీనికోసం ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 

    వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ను స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ వడ కట్టుకోవాలి. తర్వాత 5 లేదా 6 యాలకులను తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న యాలకులను బీట్రూట్ జ్యూస్ లో వేసి స్టవ్ మీద పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోవాలి. జ్యూస్ చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక కప్పు బియ్యప్పిండిని వేసి బాగా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి.  

      తర్వాత ఈ పిండిని ఎండలో రెండు గంటలపాటు ఎండనివ్వాలి. తడి లేకుండా ఎండ నివ్వడం వలన పిండి పాడవకుండా నిల్వ ఉంటుంది. ఎండిన తర్వాత పిండిని చల్లించుకొని లో ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ పిండి 15 రోజుల నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పిండిని మీరు ప్రతి రోజూ స్నానం చేయడానికి ముందు ఒక బౌల్ లో  మీకు సరిపడినంత పిండి వేసుకోవాలి .దాంట్లో రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలుపుకొని మీ ముఖానికి మరియు ఒంటికి అప్లై చేసుకుని ఐదు నుండి పది నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. 

    తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి .ఇది వాడిన తర్వాత సబ్బు వాడకూడదు. ఇలా చేయడం వలన మీ చర్మం తెల్లగా మెరిసిపోతుంది. చర్మంపై ఉండే టాన్, జిడ్డు, మురికి నిమిషాల్లో మాయం అయిపోతాయి. ఎన్ని వాడిన టాన్ పోవట్లేదు అనుకునేవారు ఒకసారి ఈ పౌడర్ ను తయారు చేసుకుని ట్రై చేసి చూడండి . మంచి ఫలితం ఉంటుంది. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది నేచురల్ సున్నిపిండి లాగా పని చేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!