చర్మం మీద పెరిగిపోతున్న మృతకణాలు శరీరాన్ని నల్లగా కనిపించేలా చేస్తాయి. ఇలా పెరిగిపోయిన మృతకణాలు సబ్బుతో స్నానం చేయడం వలన పోదు. సబ్బుతో స్నానం చేసినప్పుడు మురికి మాత్రమే బయటకి పోతుంది. కానీ చర్మంమీద స్నానం చేసిన తర్వాత కూడా చేతితో నలిపితే మట్టి వస్తూ ఉంటుంది. ఇలా చాలా రోజులు కొనసాగితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా ఈ మురికి పోయే అవకాశం లేదు. నురుగుతో పాటు పై పైన ఉండే మురికి మాత్రమే పోతుంది. ఈ మట్టి పోగొట్టుకోవడానికి నేచురోపతిలో ఒక చిట్కా ఉంది. ఎటువంటి ప్రొడక్ట్స్ వాడకుండా ఈ చిట్కా ఫాలో అయితే చర్మంపై పేరుకొన్న మృతకణాలు తొలగడంతో పాటు చర్మం మంచి రంగును సొంతం చేసుకుంటుంది.
దీనికోసం మనం తీసుకోవలసింది స్నానానికి వెళ్లేటప్పుడు రెండు టవల్స్ తీసుకొని వెళ్ళాలి. మామూలుగా మనం స్నానం తర్వాత ఒళ్ళు తుడుచుకోవడానికి ఉపయోగించేది ఒకటి కాగా, ఇంకొకటి మెత్తగా ఉండే తెల్లటి కాటన్ టవల్ తీసుకోవాలి. ఒంటికి నూనె రాసి ఈ టవల్‌తో గట్టిగా రుద్దాలి. ఇలా చేయడం వలన నూనెకి ఒంటి పై ఉన్న మురికి అంటుకొని టవల్ కి వచ్చేస్తుంది.
అలాగే ఇలా గట్టిగా రుద్దడం వలన చర్మంపై వేడి పుట్టి దానిని చల్లార్చేందుకు రక్తం ప్రసరణ ఎక్కువవుతుంది. దీనివలన చర్మం శుభ్రపడి మంచి రంగును సొంతం చేసుకుంటుంది. ఇలా కనీసం పది నుండి 15 నిమిషాల పాటు చేయడం వలన శరీరానికి వ్యాయామం కూడా అవుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే వచ్చే ఫలితాలను మీరే నమ్మలేరు.
చర్మం మీద జిడ్డులా పేరుకున్న మట్టి మొత్తం బయటకు పోతుంది. చర్మం మామూలుగా కంటే రెండు రెట్లు కాంతివంతంగా తయారవుతుంది. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. స్నానం చేసిన తరువాత ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒక మంచి అనుభూతిని పొందుతారు. ఇలా చేసిన తర్వాత చల్లటి లేదా గోరు వెచ్చని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి.