Full body whitening Soap

మూడు రోజులు క్రమం తప్పకుండా ఈ సబ్బు వాడండి మొత్తం శరీరం తెల్లగా మారుతుంది

వేసవి కాలం మొదలయ్యింది. చర్మం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం.ఈ ఎండకాలం వాతావరణం చర్మానికి హాని కలిగిస్తుంది. వంట గదిలోనుంచి బయట పడెలోపు దాదాపు మన చర్మం కమిలిపోయ్ ఉంటుంది. బయట వెళ్లి ఇంటికి వచ్చేలోపు సూర్య కిరణాలు చర్మంపై ఉన్న ఎపిడర్మి లేయర్-కు చాలావరకు హాని కలిగించి ఉంటుంది. దీని వల్ల చర్మం కరుకుగా అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ వారికి అయితే దద్దుర్లు, ఎర్రటి మచ్చలు రావటం లాంటి హాని కలుగుతుంది. పొడిబారినట్టు కళాహీనంగా ఉంటుంది. 

ఇంట్లోనే సరళ పరిహారం ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం

-కావాల్సిన పదార్ధాలు చేసుకొనే విధానం- •గ్లిసరిన్ సబ్బు లేదా పియర్స్ సోప్,-టొమాటో,-దాల్చిని పొడి, -నిమ్మరసం. వీటి నుంచి మంచి సోప్ ఒకటి తయారు చేద్దాం.

ముందుగా ఒక టమోటా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి, మిక్సర్ లో వేసి పేస్ట్ చేసుకొని అందులో నుంచి జ్యూస్ మాత్రం తీసుకోవాలి. ఇందులో నిమ్మరసం మరియు దాల్చిన చెక్క పొడి కలుపుకావాలి. ఇప్పుడు స్టోవ్ వెలిగించి, ఒక ఇనుము కడాయిలో నీరు వేసి మరగనివ్వాలి, అంతలో గ్లిసరిన్ సబ్బుని చిన్న చిన్న ముక్కలు చేసి మరో స్టీల్ గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న నీళ్లలో ఈ స్టీల్ గిన్నె ఉంచి సబ్బు పూర్తిగా కరగనివ్వాలి. 

సబ్బు పూర్తిగా కరిగిపోయిన తర్వాత, ఇందాక మనం తీసుకున్న టమోటో జ్యూస్ అందులో కలిపి ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఇది వేడి అయ్యేంతలో ఒక చిన్న స్టీల్ గిన్నేకు కొబ్బరి నూనె రాసి ఉంచుకోండి. ఇప్పుడు అందులో ఈ లిక్విడ్ రూపంలో ఉన్న సబ్బును వేసి ఇరవై నాలుగు గంటలు అంటే సబ్బుల తయారయ్యేదాకా ఒక పక్కన పెట్టేయండి. గిన్నెలో కాకుండా మీకు నచ్చిన సోప్ మోల్డింగ్స్-లో కూడా వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో ఉంచితే త్వరగా సోప్ రూపానికి వస్తుంది. 
ఉపయోగాలు ఏంటి అంటే.!

-చర్మం మీద పేరుకున్న మృత కణాలను తొలగిస్తుంది. -ముఖంపై ఉన్న జిడ్డును తొలగిస్తుంది.-మొటిమలు తగ్గుతుంది.-చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది.-చర్మం మంచిగా గ్లో అవుతుంది.ముఖ్యంగా సూర్య కిరణాల వల్ల కలిగిన ట్యానింగ్-ను పూర్తిగా తొలగించి ముడతలు రాకుండా రక్షణనిస్తుంది.

చాలా సులువైన ఈ రెమిడీ అందరికీ ఉపయోగ పడుతోంది కాబట్టి స్త్రీ, పురుషులు ఎవరైనా ఇది వాడవచ్చు.

Leave a Comment

error: Content is protected !!