Gacha kayala upayogalu gachakaya in telugu

మగవారికి దేవుడు ఇచ్చిన వరం ఈ మొక్క

చిన్నప్పుడు గచ్చకాయలు ఆడుకునే ఈ చెట్టు కాయలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ చెట్టును గచ్చకాయ చెట్టు అంటారు. ఈ చెట్టు యొక్క కాండం, కాయలు పైన ముళ్ళు ఉండి కాయలు చూడటానికి ఆల్చిప్పల్లా ఉంటాయి. వీటిలో రెండు లేదా మూడు గింజలు ఉంటాయి. ఇవి చూడడానికి గోళీల పరిమాణంలో ఉండి పిల్లలు కచ్చకాయలు, గోలీలు ఆడుకోవడానికి ఉపయోగిస్తారు. ఇంకా ఈ చెట్టు మొత్తం ముళ్ళు ఉండటం వలన ఈ చెట్లను పొలాలకి రక్షణగా కంచెలా వేసి వాడేవారు. 

ఈ చెట్టులోని ప్రతి భాగంని పురాతన ఆయుర్వేద వైద్యంలో వాడతారు. దీనిలో ఉండే అనేక ఔషధ గుణాలు అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడతాయి. ఈ మొక్కలు ఫెబాసియా కుటుంబానికి చెందినవి. గిలాండినా బండుక్ అనేది వీటి శాస్త్రీయ నామం. ఈ మొక్క ఆకులను వరిబీజానికి ఔషధంగా ఉపయోగించేవారు. ఈ మొక్క ఆకులను ఆముదంలో వేయించి వృషణానికి కడితే రెండు లేదా మూడు రోజుల్లో వరిబీజం తగ్గిపోతుంది. 

గచ్చకాయ గింజలు జ్వరానికి చాలా బాగా పనిచేస్తాయి. గచ్చకాయ గింజల్లోని పప్పును నేతితో నూరి పొట్టపై రాస్తే జ్వరం త్వరగా తగ్గిపోతుంది. పంటి సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం, పంటి నొప్పి వంటి వాటికి గచ్చకాయ చెట్టు కాండాన్ని సేకరించి ముల్లు లేకుండా చేసి దానితో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు బలంగా తయారవడంతో పాటు చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన వంటివి తగ్గిపోతాయి. గచ్చకాయ పువ్వులను దంచి ఆ రసం తీసి తాగడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే మూత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

 గచ్చకాయ గింజలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం గింజలను తినేసి నీటిని తాగడం వల్ల 15 రోజుల్లో షుగర్ అదుపులోకి వస్తుంది. ఇవి తాగేటప్పుడు రెండు రోజులకు ఒకసారి సుగర్ టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ అదుపులోకి వచ్చిన తర్వాత ఈ గింజలను తీసుకోవడం ఆపేయాలి. లేదంటే షుగర్ లో అయ్యే అవకాశం ఉంటుంది. బట్టతలపై వెంట్రుకలు రావడానికి ఈ గింజల పేస్టును అప్లై చేస్తె జుట్టు మళ్లీ పెరుగుతుంది. ఈ గింజలను పొడిలా చేసి మజ్జిగలో చిటికెడు పొడి, ఉప్పు వేసి తాగడం వలన కీళ్ళనొప్పులు, థైరాయిడ్ గ్రంధి వాపు తగ్గుతుంది.

 స్త్రీలలో ఋతుక్రమం సమస్య ఉన్నవారు చిటికెడు గచ్చకాయ పొడి, ఐదు మిరియాలు పొడి కలిపి తీసుకోవడం వల్ల నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. శరీరంలో అనేక రకాల నొప్పులకు ఈ ఆకులను నూనెలో వేయించి కట్టడం వలన నొప్పులు తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే వదలకుండా తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి.

1 thought on “మగవారికి దేవుడు ఇచ్చిన వరం ఈ మొక్క”

Leave a Comment

error: Content is protected !!