garlic medicine properties

వెల్లుల్లి తినేవారి శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు | Garlic

జంతువులలో గుండెపోటు రావడం మీరెప్పుడైనా చూసారా. అదేం ప్రశ్న అనుకుంటున్నారా. ఎందుకంటే ప్రపంచ మనుష్యుల మరణాలలో ఎక్కువ శాతం గుండెపోటు వలనే సంభవిస్తాయి. అలాంటిది మనుషులకంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న జంతువులు గుండెపోటు తో మరణించినట్లు ఎప్పుడూ వినలేదు. కారణం జంతువులు ఎలాంటి జీవనశైలి ఉంటుందో దానికే కట్టుబడి ఉంటాయి. మనుషులు మాత్రం అసాధారణ జీవనశైలి మార్పులతో గుండెపోటు లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారినపడుతున్నారు. ఇప్పటికే ఈ జీవనశైలి వలన డయాబెటిస్, కీళ్ళనొప్పులు, కంటిచూపు మందగించడం, గుండె వ్యాధులు,రక్తపోటు లాంటి వ్యొధులతో ఇబ్బంది పడుతున్నారు. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

అందరూ తినే తిండిపై శ్రద్ద వహించడం చాలా అవసరం. వ్యాయామంతోపాటు ఇంట్లోఉండే పదార్థాలు తో చేసిన ఈ చిట్కా ఆరోగ్య రక్షణకు సహకరిస్తుంది. అదేంటంటే వెల్లుల్లి. వెల్లుల్లికు భారతీయ వంటల్లో ప్రత్యేక స్థానం ఉంది. దాని వాసన వంటల్లో వచ్చే రుచివలన మసాలాలలో ప్రత్యేకంగా వాడతారు. వెల్లుల్లిని వేయించడంవలన దానిలోని పోషకాలు పూర్తిగా నశించిపోతాయి. వెల్లుల్లి ని పచ్చిగా తినడంవలన మీ ఆరోగ్యానికి కావలసిన లక్షణాలు దొరుకుతాయి. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. యాంటీ బాక్టీరియా గుణం బాక్టీరియల్ ఇన్పెక్షన్ నుండి కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ నుండి, ఇందులో ఉఃడే యాంటీ వైరల్ లక్షణం వైరల్ ఇన్ఫెక్షన్లు ఫ్లూలనుండి, యాంటీ ఇన్ప్లమేటరీ గుణం వాపులు నొప్పుల నుండి  రక్షిస్తుంది. వెల్లుల్లిని దంచి తేనెతో తినొచ్చు లేదా ఉదయాన్నే పచ్చివెల్లుల్లిని నమిలి మింగేసి నీటిని తాగొచ్చు. 

ఉదయం కుదరకపోతే రాత్రి పడుకునేముందు కూడా తాగొచ్చు. ఈ పద్దతులు  పాటిస్తే నెలరోజుల్లో ఎలాంటి అనారోగ్యమైనా తగ్గిపోతుంది. సాధారణంగా మూడు, నాలుగు రోజుల్లో తగ్గాల్సిన జలుబు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు నిమ్ముగా మారి బాధిస్తుంది. రాత్రి పడుకునేముందు వెల్లుల్లిని నమిలి వేడినీటిని తాగడంవలన  ఇమ్యూనిటిని పెంచుతుంది. ఉదయాన్నే వెల్లుల్లి తినడంవలన అధికబరువు సమస్య తగ్గుతుంది. దీనివలన శరీర మెటబాలిజం పెరిగి అధిక కొవ్వు కరిగిపోతుంది. అనేక గుండె సమస్యలు నుండి రక్షిస్తుంది. గుండెపోటు కు ప్రధాన కారణం రక్తం మందంగా మారిపోవడం. రక్తం మందంగా మారిపోతే రక్తనాళాల్లో పేరుకుని రక్తప్రసరణ అడ్డుకుంటుంది. ఎండాకాలంలో అయితే ఒకటి చలికాలంలో రెండు వెల్లుల్లి రెబ్బలు తినాలి. వెల్లుల్లి రక్తాన్ని పలుచగా చేసి శుద్ధిచేస్తుంది. అకారణ మరణానికి దూరంగా ఉంచుతుంది. రూపంలో జీడిపప్పు ను పోలిఉండే వెల్లుల్లి ఖరీదులో అందరికీ అందుబాటులో ఉండే వెల్లుల్లిని తింటూ ఆరోగ్యాన్ని రక్షించుకోండి.

Leave a Comment

error: Content is protected !!