గరుడ వర్ధనం లేదా నందివర్ధనం ఇంటిదగ్గర పెంచుకోవడం వల్ల సుఖ శాంతులు కలుగుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. గరుడ వర్ధనం పూలు తెలుపు వర్ణం తో, 5 రేఖలను కలిగి, సువాసనలు వెదజల్లుతూ ఎంతో మనోహరంగా ఉంటాయి. గరుడ వర్ధన పూలు శివారాధనకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పూలు గరుత్మంతునికి చాలా ప్రీతికరమైనవి. గరుడ వర్ధన పూలతో శివారాధన చేయడం వల్ల కోరిన కోర్కెలు అన్ని నెరవేరుతాయి.
నందివర్థనం పూలతో శివునికి, గరుడ వర్ధనం పూలతో విష్ణువుకి పూజ చేస్తారు. దైవారాధనకే కాకుండా ఈ చెట్టు ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఈ చెట్టు యొక్క ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోతారు. పంటి నొప్పికి ఈ చెట్టు వేర్లను, వేళ్లపై బెరడును ఉపయోగిస్తారు. నందివర్ధనం లేదా గరుడ వర్ధనం పూలు కంటి అలసటను తగ్గించి కంటి నరాలకు బలాన్ని ఇస్తాయి. గరుడ వర్ధనం పువ్వు లు రెండు తీసుకొని నీటిలో ముంచి కళ్ళపై పెట్టుకుని కాసేపు రిలాక్స్ అవ్వడం వల్ల పని ఒత్తిడి వల్ల కలిగే అలసట తగ్గుతుంది.
కళ్లు ఎర్రబడటం, మంటలు రావడం కూడా తగ్గుతాయి. ఇలా పువ్వులను కంటి పై పెట్టుకోవడం వల్ల సాధారణ ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది. ఈ కారణం చేతనే పల్లెటూర్లలో నందివర్ధనం, గరుడ వర్ధనం చెట్లను ఎక్కువగా పెంచుతారు. వయసు మళ్ళిన వారు కూడా ఇలా చేయడం వలన దృష్టిలోపాలు తగ్గించి, కంటిచూపును మెరుగు పరుస్తాయి. చిన్నపిల్లలు కంటిచూపు సమస్యలతో బాధ పడితే ఈ చిట్కాలు పాటించినట్లయితే కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ పువ్వులను మూడు కోసి గ్లాస్ నీటిలో నాలుగు గంటల పాటు నానబెట్టి ఆ నీటితో కళ్ళను కడిగినట్లయితే కంటి సమస్యలు, కళ్ల మంటలు, కళ్ళు నొప్పులు తగ్గుతాయి.
ఈ చెట్ల నుండి వచ్చే పాలను గాయాలు లేదా పుండ్ల మీద అప్లై చేస్తే గాయాలు, పుండ్లు తగ్గిపోతాయి. తలనొప్పి, కంటి నొప్పులు ఉన్నట్లయితే ఈ ఆకుల రసాన్ని తీసి కొబ్బరి నూనెలో కలిపి తల నుదురు భాగంలో రాస్తే తలనొప్పి, కంటి నొప్పులు తగ్గుతాయి. కాళ్ళ పై ఉండే పుండ్లు నొప్పి తగ్గాలంటే ఆకుల రసాన్ని తీసి అప్లై చేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ ఆకులు నీటిలో వేసి మరిగించి వడకట్టి చల్లారాక కళ్ళు కడుక్కుంటే కళ్ళు దురదలు, నొప్పులు తగ్గుతాయి.
కొంతమందికి కళ్ళు అంటుకుంటాయి వారు ఈ ఆకులు వేసి మరిగించిన నీటితో కళ్ళు కడుక్కుంటే కళ్ళు శుభ్రపడతాయి. ఎలుక లేదా పంది కుక్క కరిచిన విషాన్ని పోగొట్టడానికి నందివర్దన బెరడు, నందివర్ధన పువ్వులు వేసి మరిగించిన నీటిని నాలుగు చెంచాల చొప్పున వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల విషం పోతుంది. నందివర్ధనం పూలను పేస్ట్ చేసి ముఖానికి రాసుకోవడం వల్ల కళ్ళకింద ఉండే నల్లటి వలయాలు పోతాయి. నందివర్ధనం లేదా గరుడ వర్ధనం చెట్లను ఇంటిదగ్గర పెంచడం వలన అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.