gas acidity home remedy

ఎసిడిటీ ఎంత ఎక్కువగా ఉన్నా సరే ఈ గింజలను నోట్లో వేసుకుని నమిలితే నిప్పుల మీద నీళ్లు చల్లినట్లే

శరీరంలో గ్యాస్ పేరుకుపోతే అది వాంతులు వికారం గొంతులో మంట ఛాతీలో నొప్పి వంటి అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది వీటిని తగ్గించుకోవడానికి మనం కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించవచ్చు ఇవన్నీ ఆయుర్వేద డాక్టర్లు ధ్రువీకరించిన ఇవి కొన్ని పరిశోధనల ద్వారా నిరూపితమైనదిదీనికోసం మొదట మనం తీసుకోవాలి వాము నానబెట్టి ఉదయాన్నే ఆ నీరుతాగడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్ నుండి ఉపశమనం పొందుతుంది.

 అజ్వైన్ గింజలలో ఉండే థైమోల్, కడుపులో గ్యాస్ట్రిక్ రసాలను విడుదల చేయడంలో సహాయపడుతుంది, తద్వారా జీర్ణక్రియ ప్రక్రియను పెంచుతుంది.  గ్యాస్: గ్యాస్ మరియు ఉబ్బరం ఉన్న రోగులకు అజ్వైన్ నీరు తరచుగా సిఫార్సు చేయబడుతుంది. లేదా ఒక స్పూన్ తేనెకు ఒక స్పూన్ వాము పొడి కలిపి తినడం వలన కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారించవచ్చు. తర్వాత పదార్థం సోంపు. సోంపు జీర్ణక్రియకు చాలా బాగా పనిచేస్తుంది అందరికీ తెలిసిందే. ఆహారం తిన్న వెంటనే కొద్దిగా సోంపు గింజలు తినడం ఆహారం బాగా జీర్ణం అయ్యేందుకు, గ్యాస్ ట్రబుల్ తగ్గేందుకు సహాయపడుతుంది. తేనె కూడా గ్యాస్ ట్రబుల్ ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె వేసి ఆ నీటిని తాగడం వలన కడుపులో జీర్ణ రసాలు బాగా విడుదలయ్యేందుకు ఆహారం బాగా జీర్ణం అయి గ్యాస్ పేరుకోకుండా అడ్డుకునేందుకు సహాయపడుతుంది. 

తరువాత పదార్థం పాలు. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. గ్యాస్ట్రిక్ వలన వచ్చే సమస్యలు పడతాయి. అలాగే పండ్లు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తాయి అయితే కొన్ని పండ్లు గ్యాస్ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది కనుక ఏ పండు తిన్నప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుందో గమనించి వాటిని తినకపోవడం మంచిది. అలాగే ప్రతిరోజు ఆహారం చేసిన తర్వాత 15 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.  రోజు రెండున్నర లీటర్ల కంటే ఎక్కువ నీటిని తాగాలి. ఆహారంలో మసాలాలు, మాంసాహారం ఎక్కువగా లేకుండా జాగ్రత్తపడాలి. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అలాగే నడక, వ్యాయామం వంటివి జీవిత విధానంలో ఒక భాగం చేసుకోవాలి.

Leave a Comment

error: Content is protected !!