Gas Trouble Relief In 5 Minutes

గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట సెకండ్స్ లో మాయం………

 గ్యాస్ ట్రబుల్ అనేది ఎంతోమందిని వేధిస్తున్న ఒక పెద్ద సమస్య. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది చిన్న వయసు వారి నుండి పెద్ద వయసు వారి వరకు అందరికీ సర్వసాధారణంగా వచ్చేస్తుంది. ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య కొంతమందికి మలబద్దక రూపంలో, మరి కొంతమందికి కడుపు ఉబ్బరం రూపంలో, కొంతమందికి నోట్లో నీళ్ల ఊరటం రూపంలో, మరి కొంతమందికి తెన్పుల రూపంలో, మరి కొంతమందికి కడుపులో ఏదో పరువుగా ఉన్నట్టు ఇలా రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉండవచ్చు. ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య వచ్చినప్పుడు వాళ్లు పడే బాధ వర్ణ అతీతం. ఏ ఆహారం తీసుకోవాలన్న భయపడుతూ ఉంటారు.

                     మరియు ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యకు పరిష్కారం ఏమిటంటే ప్రకృతి ప్రసాదించిన ప్రకృతి సిద్ధమైన ఔషధాలు వాడడం వల్లే ఈ గ్యాస్ ట్రబుల్ రాకుండా కాపాడవచ్చు. ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే, మొదటిది సైంధవ లవణం దీనిని పూర్వకాలంలో ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంబంధించిన ఆహారంలో వాడేవారు దీనిని రాక్ సాల్ట్ అని కూడా అంటారు. రెండవది సొంటి, అల్లాన్ని ఎండించి తయారుచేసిన ఔషధ పదార్థాన్ని సొంటి అంటారు. ఇది మార్కెట్లో మనకు దొరుకుతుంది. మూడవది తాటి బెల్లం ఇది మార్కెట్లో ఎల్లప్పుడూ దొరుకుతుంది. 

                  ఔషధం తయారీ విధానం ఏమిటంటే ముందుగా సైంధవ లవణం 20 గ్రాములు తీసుకోవాలి. దానికి సొంటి చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోవాలి. దీనికి 100 గ్రాములు తాటి బెల్లం తీసుకొని పోడిల మెత్తగా చేసుకోవాలి. దీనిని బాగా కలపాలి. ఈ విధంగా తయారుచేసిన ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. దీనిని ఒక అర టీ స్పూన్ అరచేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా చప్పరించాలి. ఆ యొక్క రసాన్ని కూడా మింగేయాలి. తరువాత ఒక కప్పు గోరువెచ్చని లేదా కాచి చల్లార్చిన నీళ్లు లేదా మామూలు నీళ్లు తాగాలి, కూలింగ్ వాటర్ తాగకూడదు. 

              ఇలా ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్ పొడిని తీసుకోవాలి. లేదా ఉదయం మాత్రమే ఒకసారి తీసుకోవాలంటే ఐదు గ్రాముల పొడిని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్ లో ఉంటుంది. ఈ ఔషధాన్ని రోజు సేవించడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు కలుగవు……..

Leave a Comment

error: Content is protected !!