భోజనం చేసిన తర్వాత కొంతమందికి వక్కపొడి వేసుకోవడం, కొంతమందికి సోంపు వేసుకోవడం అలవాటు. వక్కపొడి వలన దంతాలు గారపట్టడం, దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ల సమస్యలు, దీర్ఘకాలం వాడితే క్యాన్సర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భోజనం తర్వాత ఇది మంచి అలవాటు. పూర్వకాలం నుంచి మన ఆహార అలవాట్లలో సోంపు కూడా ఉంది. కొంతమంది ఎక్కడైనా ఫంక్షన్లో అది మాత్రమే వాడుతూ ఉంటారు సోంపు భోజనం తర్వాత తినడం వలన కడుపులో గ్యాస్, కడుపుబ్బరం, పుల్లటితేన్పులు తగ్గించడంలో సహాయపడుతుంది. సోంప్లో ఎధితోల్ అనే రసాయనం ఫైబర్‌తో కలిసి ఉండడం వలన జీర్ణ వ్యవస్థలో సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో సహాయపడుతుంది.
100 గ్రాములు తీసుకుంటే 40 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. కూరగాయలు, చిరుధాన్యాల కంటే సోంపు లో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. ఫైబర్ గుడ్ బ్యాక్టీరియా కి ఆహారం. వాటి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ బ్యాక్టీరియా కడుపులో ప్రేవుల్లోని ఆహారం పులవకుండా అడ్డుకుంటుంది. కొంతమంది టీ, కాఫీలు తాగడం, మానసిక సమస్యలు, పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కడుపులో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ రసాయనాలు ఎక్కువ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. సోంపు ఈ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించి కడుపులో ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతుంది.
ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి పులవకుండా ఉండడానికి, ప్రేవుల్లో మలం కిందకు జరగడానికి ఎధితోల్ కెమికల్ బాగా ఉపయోగపడుతుంది. ప్రేగుల్లో ఆహార నిల్వ ఉండకుండా మలబద్ధకం సమస్యను తగ్గించి కడుపు శుభ్రం చేస్తుంది. దీనికోసం ఒక పావు కేజీ సొంపు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉపయోగపడుతుంది. ఈ రోజు ఆహారం తర్వాత ఒక స్పూన్ తింటూ ఉంటే కడుపులో మలబద్దకం, గ్యాస్, ఉబ్బరం, కడుపునొప్పి లాంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
చాలా మందికీ ఆకలి సరిగా అవ్వట్లేదు, జీర్ణాశయ సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు మార్కెట్లో ధనియాలు పప్పు అనేది దొరుకుతుంది. సోంపు తో పాటు రెండు చెరో కప్పు పరిమాణంలో తీసుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని రోజు ఆహారం తర్వాతా, వీలైనప్పుడు ఒక స్పూన్ తింటూ ఉంటే కడుపులో సమస్యలు తగ్గుతాయి. సోంపు జీర్ణాశయ సమస్యలకే కాకుండా కడుపులో చేరిన చెడు బ్యాక్టీరియా, బ్లాక్ ఫంగస్ వంటి బ్యాక్టీరియాలను కూడా నాశనం చేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తుంది. నమలలేని లేని వారు ఒక స్పూన్ నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తేనెతో కలిపి తాగవచ్చు. మూత్ర వాహిక వద్ద కండరాలకు ఉపశమనం కలిగించి మలవిసర్జన సులభం చేస్తుంది. జీర్ణవ్యవస్థలో సమస్యలు తగ్గిస్తుంది.