విటమిన్ E అనేది ఫ్యాట్ సోలబుల్ విటమిన్ క్రొవ్వులలో నిల్వ ఉండే రకం. ఇది ఆరు నెలలు అందుకనే ఎక్కువ రోజులు కూడా శరీరంలో దాచుకుంటుంది. విటమిన్ ఇ అనేది 6 రకాలుగా ఉన్నప్పటికీ టోకో ఫిరాల్ విటమిన్ E మాత్రమే ముఖ్యంగా మనకు అవసరం. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. ప్రతి కణము తనని తాను రిపేర్ చేసుకోవడానికి విటమిన్ E అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో శక్తి విడుదల అవడానికి విటమిన్ E కావాలి. ఇమ్యూన్ సిస్టం ని ఆక్టివేట్ చేసి ఏ భాగంలో వైరస్ బ్యాక్టీరియాలో ఉండి అక్కడ ఇన్ఫెక్షన్ కలిగిస్తూ ఉంటే ఆ భావానికి ఎక్కువ బ్లడ్ సప్లయ్ వెళ్లే లాగా చేస్తుంది.
ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సపోర్ట్ చేస్తుంది. మగవారిలో వీర్యకణాలను ఉత్పత్తి చేసే కణజాలాన్ని ఎక్కువ కాలం బ్రతికేటట్టు చేసి స్పర్మ్ ప్రొడక్షన్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. సెల్ టూ సెల్ ఇంటరాక్షన్ ని బాగా ఉండేటట్టు గా విటమిన్ E సపోర్ట్ చేస్తుంది. రక్తనాళాల్లో ప్రోస్టా సైక్లిన్స్ అనే వాటిని విడుదల చేసి రక్తనాళానికి ప్లేట్లెట్స్ అంటుకోకుండా కాపలా కాస్తుంది. మన చర్మం ముడుతలు పడకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చూస్తే చర్మాన్ని మార్చురైజింగ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కంటి లోపల మేక్యుల డి జనరేషన్ జరగకుండా E విటమిన్ కాపాడుతుంది.
ముఖ్యంగా విటమిన్ E అనేది యవ్వనాన్ని ఎక్కువ కాలం ఉంచేలా ముసలితనం రాకుండా అద్భుతంగా ఉపయోగపడుతుంది. 15 సంవత్సరాల వయసు ఉన్నవారికి ఏడు నుండి 11 మిల్లి గ్రాముల విటమిన్ E అవసరమవుతుంది. 15 సంవత్సరాలు పైబడిన వారందరికీ 15 మిల్లీ గ్రాములు ఒక రోజుకి కావాలి. గర్భవతులకు మాత్రం 19 మిల్లీ గ్రాములు ఒకరోజు కావాలి. విటమిన్ E అనేది విత్తనాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలలో పాలకూరలో 2 మిల్లీగ్రాములు ఉంటుంది. ఫ్రూట్స్ లో అవకాడో ఫ్రూట్ లో 2 మిల్లీగ్రాములు ఉంటుంది. వాల్ నట్స్ లో 2 మిల్లీగ్రామ్స్, వేరుశనగల్లు 4 మిల్లిగ్రామ్స్, ఎండు కొబ్బరిలో 6 మిల్లీగ్రామ్స్ ఉంటుంది.
పొద్దుతిరుగుడు పప్పులో 38 గ్రాములు, బాదంపప్పులలో 28 మిల్లి గ్రాములు ఉంటుంది. విటమిన్ E క్యాప్సిల్స్ అసలు వాడకుండా నాచురల్ గా ఇటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి.