Get Deep Sleep In Seconds Vasantha lakshmi

ఇవి తీసుకుంటే నిమిషాల్లో నిద్ర పడుతుంది

  చాలామందికి నిద్రలేమి సమస్య ఎక్కువగా బాధిస్తుంది. రోజు సరిగా నిద్ర లేకపోవడం వలన అలసటగా, నీరసంగా ఉంటుంది. ఏ పని మీద ధ్యాస పెట్టలేము. అందుకే రోజు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర తప్పనిసరి.ఒకవేళ నిద్ర సరిపోకపోతే అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేసినట్లయితే నిద్రలేమి సమస్య తగ్గి గాఢ నిద్ర పడుతుంది. గసగసాలు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే పదార్థం. 

తగిన మోతాదులో తగిన పద్ధతిలో తీసుకోవడం వలన నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది గసగసాలు నిద్రని ప్రేరేపించి నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి ఒక అరచెంచా మెత్తగా నూరి పాలలో కలిపి తీసుకోవడం వలన నిద్రలేమి సమస్య తగ్గి బాగా నిద్ర పడుతుంది ఇలా రెండు మూడు రోజులపాటు చేస్తే సరిపోతుంది గసగసాలు రోజూ ఆహారంలో చేర్చుకోవడం వలన మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. గసగసాలు పేగులలో కదలికను సరిగ్గా జరిగేటట్టు చేసి మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. 

సంతానం కోసం చూసే వారు కూడా గసగసాలు సరైన మోతాదులో తీసుకోవడం వలన ఫెలోఫియన్ నాళంలో ఉండే అడ్డంకులను తొలగించి గర్భధారణకు సహాయపడతాయి. గసగసాలు లైంగిక ఉత్పత్తిని, లైంగికసామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. గసగసాలులో ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకం సమస్య తగ్గుతుంది. సుఖవిరోచనం జరుగుతుంది. మానసిక ప్రశాంతతని ప్రేరేపించి, ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టెలాగా చేస్తాయి. గసగసాలులో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వలన పేగులలోని గాత్రాన్ని కదిలించడంలో సహాయపడతాయి.

పేగులలో కదలికలు రావడం వలన మలవిసర్జనను ప్రేరేపించి మలబద్ధకం సమస్యని తగ్గిస్తాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు గసగసాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఫాలోపియాన్ నాళం గసగసాల నూనెతో శుభ్రం చేయడం వలన ఫెలోపియన్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సంతానోత్పత్తి ప్రేరేపించబడుతుంది. ఫాలోపియన్ నాళం శుభ్ర పడటం వలన ఆడవారిలో వంధ్యత్వం తగ్గుతుంది. దృష్టి లోపాలు తగ్గించి కంటి వెనకాల ఉండే మాకుల అనే పొరను కాపాడి కంటిచూపును మెరుగుపరుస్తుంది. 

గసగసాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి. గసగసాలు కంటి కణాలపై ఉండే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం వలన కంటి చూపు కోల్పోవడం వంటి నష్టాన్ని తగ్గిస్తాయి. గసగసాలు వలన ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రలేమి సమస్యని వతగ్గించడంతో పాటు, సంతానలేమి సమస్య తగ్గించడంలో కూడా గసగసాలు చాలా బాగా ఉపయోగపడతాయి.

Leave a Comment

error: Content is protected !!