get fair skin overnight

ఈ పొడిని ఇలా కూడా వాడొచ్చని ఎవరికీ తెలీదు, రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు

 ప్రతి ఒక్కరు చాలా అందంగా ఉండాలి అని మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తారు.  వాటిలో అనేక రకాల కెమికల్స్ ఉండడం వల్ల  అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ఇంట్లో ఉన్న వాటితోనే  ముఖాన్ని అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక  బీట్ రూట్ తీసుకొని పీల్  చేసుకొని మెత్తగా  తురుముకోవాలి. టీ  వడపోసుకునే   స్ట్రైనర్ సహాయంతో  బీట్రూట్ తురుము నుండి జ్యూస్ను వడకట్టుకోవాలి.   

      ఒక జాజి కాయ తీసుకొని  గ్రేటర్ సహాయంతో జాజికాయ తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల శెనగపిండి వేసుకోవాలి. శనగపిండి వద్దు అనుకున్న వారు ముల్తాని మట్టిని వేసుకోవచ్చు. తర్వాత ఒక చెంచా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్  పౌడర్ బదులుగా పాలను కూడా వేసుకోవచ్చు. రెండు చెంచాల పెరుగు వేసుకోవాలి. అరచెంచా జాజికాయ పొడిని వేసుకోవాలి. తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి వీలుగా  ఉండే విధంగా  బీట్ రూట్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 

     ఈ మిశ్రమాన్ని ముఖానికి మందంగా  అప్లై చేసుకోవాలి. ఆరేవరకు ఉండనివ్వాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే ముఖం పై ఉండే నలుపు మొత్తం పోయి ముఖం తెల్లగా, అందంగా తయారవుతుంది. బీట్రూట్ చర్మం రంగును మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మిల్క్ పౌడర్ కూడా చర్మ రంగును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగు ముఖంపై ఉండే టాన్    జిడ్డు, మురికి పోగొట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది. 

      శెనగపిండి చర్మానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తగ్గించి మోటుపల్లి మోటుపల్లి వల్ల వచ్చిన మచ్చలు డాక్టర్ కంటి సమస్యలు కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. జాజికాయ ముఖానికి మంచి రంగును ఇవ్వడంలో మొటిమలు, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు  పిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ను వారానికి ఒకసారి ఉపయోగించినట్లయితే నీ ముఖం పై ఉండే నల్లని మచ్చలు మొటిమలు డార్క్ సర్కిల్స్ టాన్,  జిడ్డు, మురికి వంటి సమస్యలను తగ్గించి మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మారుస్తుంది. 

      ఈ ప్యాక్ ఒకసారి ఉపయోగించినట్లయితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.  అంత బాగా పనిచేస్తుంది. అవసరం అనిపిస్తే మీరు కూడా ఒక సారి ట్రై చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!