get fair skin permanently naturally

మీ స్కిన్ ఎంత నల్లగా ఉన్నా పది నిమిషాల్లో తెల్లగా మారుతుంది

శ్రావణ మాసం వచ్చేసింది అంటే అందరూ పూజలు తో చాలా బిజీ బిజీగా ఉంటారు. ఇంటికి  ఎవరోకరు వస్తుండటం లేదా మీరే  వేరే వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే పార్లర్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మీరు అందంగా, తెల్లగా మెరిసిపోవచ్చు. నేను తెల్లగా మెరిసిపోవాలంటే రెండు రకాల ప్యాకెట్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా  ప్యాక్  తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో శెనగపిండి వేసుకోవాలి.  శనగపిండి వద్దు అనుకున్న వాళ్లు  పెసరపిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత దానిలో ఒక చెంచా కాఫీ పౌడర్ వేసుకోవాలి. 

       పావు చెంచా కస్తూరి పసుపు వేసుకోవాలి. కస్తూరి పసుపు లేదనుకున్నవాళ్ళు  మామూలు పసుపు  కూడా ఉపయోగించవచ్చు. అర చెక్క నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వద్దు అనుకున్న వారు టమోటో జ్యూస్ లేదా పొటాటో జ్యూస్ కూడా తీసుకోవచ్చు. తర్వాత దీనిలో రెండు చెంచాల పెరుగును వేసుకోవాలి. పెరుగు అన్ని రకాల  స్కిన్స్ వారికి  సూట్ అవుతుంది. పెరుగు వద్దు అనుకున్న వారు పాలను  కానీ లేదా రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ ప్యాక్ను బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా ఒకసారి చేయడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది. 

     పార్లర్కి వెళ్లే టైం లేదు ఏదైనా  ఫంక్షన్లో లేక పార్టీకి  వెళ్లాలి అనుకున్న పది పదిహేను నిమిషాల ముందు ఈ ప్యాక్ని వేసుకున్నట్లయితే మీరు అందంగా, కాంతివంతంగా తయారవుతారు. తెల్లగా మెరిసిపోతారు. అంతేకాకుండా మీ ముఖంపై ఉండే టాన్  మొత్తం పోతుంది. రెండవ ప్యాక్ దీనికోసం ఒక బౌల్ లో ఒక   చెంచా గోధుమపిండి తీసుకోవాలి. గోధుమపిండి వద్దు అనుకున్న వాళ్లు  రెడ్ మసూర్ దాల్ పిండి లేదా  శనగపిండి కూడా ఉపయోగించవచ్చు.   ఒక చెంచా బియ్యపిండి వేసుకోవాలి. ఒక చెంచా కాఫీ పౌడర్ వేసుకోవాలి. కొంచెం టమోటో జ్యూస్ క్యారెట్, బీట్రూట్ లేదా  పొటాటో జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఒక చెంచా తేనె వేసుకోవాలి. 

       తేనె వద్దు అనుకున్న వాళ్లు  పంచదార కూడా వేసుకోవచ్చు.  ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఫేస్ కి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ప్యాక్ అప్లై చేయడం వల్ల మీ  స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ఉండే నల్లని మచ్చలు, వలయాలు, సన్ టాన్  మొత్తం పోయి చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. మీరు ఎక్కడికి అయినా వెళ్లాలి అనుకున్న ఐదు నిమిషాలు ముందు అప్లై చేసుకున్న మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు అవసరం అయినప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక ప్యాక్ ను ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!