వేసవి కాలం అయిపోయినప్పటికీ ముఖం పై టాన్ అందరికీ చాలా ఎక్కువగా ఉంది. దాన్ని పోగొట్టుకోవటం కోసం పార్లర్కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. కానీ వేలకు వేలు ఖర్చు పెట్టడం అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ముఖంపై ఉండే టాన్ మొత్తం పోగొట్టుకోవచ్చు. అలాగే ఇది పండుగల సీజన్ కాబట్టి అందంగా రెడీ అవడం కోసం పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. కెమికల్స్ ఉండే క్రిములు అప్ప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు.
ఈ చిట్కా ఉపయోగించినట్లయితే మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా పంచదార వేసి బాగా కలిపి ముఖంపై అప్లై చేసి రెండు మూడు నిమిషాల వరకు బాగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం పై ఉండే జిడ్డు, మురికి, టాన్ మొత్తం పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. పెరుగు మీ ముఖాన్ని కాంతివంతంగా తయారు చేసి మోయశ్చరైజ్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
పంచదార ఓపెన్ పోర్స్ రిమూవ్ చేయడంలో, డెడ్ స్కిన్ సెల్స్ తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత పెరుగు, పంచదార కలిపిన బౌల్ లోనే ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా కాఫీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. డబల్ ఎయిట్ గా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత బాగా ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో మొహం కడిగేసుకోవాలి ఇలా చేసినట్లైతే ముఖంపై ఉండే టాన్ పోయి ముఖం తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది.
మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకునే ఒక 10 నిమిషాల ముందు ఇది ట్రై చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. శెనగపిండి, కాఫీ పౌడర్ చర్మం తెల్లగా చేయడంలో బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ను బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పార్లర్కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టిన అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. మిమ్మల్ని చూసిన వారందరూ ఇంత తెల్లగా ఉన్నావు ఏమి ఉపయోగిస్తున్నారని అడగాల్సిందే!