ప్రస్తుత కాలంలో వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న సమస్య మోకాళ్ల నొప్పులు. దీనికోసం ఎన్నో రకాల మందులు మరియు పై పూతకు పెయిన్ కిల్లర్ జెల్స్ ను ఉపయోగిస్తూ ఉంటాం. కానీ అవి కొంత సేపటి వరకు మాత్రమే నొప్పి నుంచి విడుదల ఇస్తాయి. దీనికోసం ఇంట్లోనే ఉపయోగించే పదార్థాలతో ఒక నాచురల్ పద్ధతిని చూద్దాం. అది ఆవాల ప్యాక్. మనం ఆవాలు ఉపయోగించి ఆవకాయ పచ్చళ్ళు మరియు తాలింపు లలో ఉపయోగిస్తుంటాం. ఆవాలను ఆహారం లోనే కాకుండా బయట శరీరానికి కూడా ఉపయోగించవచ్చు.
ఆవాలలో నొప్పిని తగ్గించే గుణాలు ఉంటాయి. ఈ ఆవాలను పొడి చేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టి దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి అందులో ఒకటీన్నర స్పూన్ల ఆవపిండిని ఆ నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఇలా రెండు గ్లాసుల నీళ్లు ఒక్క గ్లాసు అయ్యేంతవరకు మరిగించాలి. ఆ తరువాత మన మోకాళ్ళకు సరిపడా ఒక కాటన్ గుడ్డను తీసుకొని దానిని నీటిలో ముంచి మోకాళ్ళకు చుట్టుకోవాలి. నడుము నొప్పి వచ్చే వాళ్లు కూడా ఈ విధంగా ప్యాక్ వేసుకోవచ్చు. ఆ నీరు మరీ వేడిగా ఉండగా తీసుకోకూడదు. మన శరీరం తట్టుకోగలిగిన అంత వేడితో మాత్రమే పెట్టుకోవాలి.
ఇలా ఆవపిండిని నీటిలో మరిగించడం వలన దానిలోని రసాయనాలన్ని నీటిలోకి దిగి ఒక కషాయం లాగా మారుతాయి. గుడ్డ వేడి తగ్గిన తర్వాత మరలా ఆ నీటిలో ముంచి మళ్లీ కాళ్ళకు చుట్టుకోవాలి. ఇలా ఒక 20 నిమిషాల పాటు చేయాలి. ఈ ఆవలలో ఉన్న ప్రాపర్టీస్ వలన మరియు వేడి నీటి వలన కండరాలు రిలాక్స్ అయ్యి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మరియు నొప్పికి కారణమయ్యే రిసెప్టార్స్ ని కూల్ చేస్తాయి. ఎక్కువ నొప్పిని భరించ కుండా ఇవి చేస్తాయి. ఇది నేచురోపతి లో రుజువుచేయబడిఇప్పుడు వాడుకలో ఉంది.
ఈ ప్యాక్ అన్ని రకాల వయసువాళ్ళు ఉపయోగించవచ్చు. ఇంకా కావాలంటే ఈ ప్యాక్ వేసుకొనే ముందు ఆవనూనెలో 2 కర్పూరం ముద్దలు వేసుకొని బాగా కలుపుకొని కాళ్ళకి మర్దన చేసుకుని తరువాత ప్యాక్ వేసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ ఉపసమనం కలుగుతుంది…