వర్షకాలం వచ్చేసింది దోమలు ఎక్కువగా ఉంటాయి. ఈ దోమలు కుట్టడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటివి వస్తుంటాయి. ఇలాంటి దోమల నుంచి మనం తప్పించుకోవడానికి రకరకాల కెమికల్స్ ఉండే మందులను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా నేచురల్ చిట్కాల ద్వారా ఈ దోమలు ఇంట్లో నుండి తరిమికొట్టొచ్చు ఈ చిట్కాలు ట్రై చేసినట్లైతే ఇంట్లో ఒక్క దోమ కూడా మిగలదు.
మొదటి చిట్కా వేప నూనె మూడు చెంచాలు తీసుకుని ఒక చెంచాడు కర్పూరం వేసి బాగా కలపాలి. బిర్యానీ ఆకులు రెండు తీసుకొని ఈ నూనె బిర్యానీ ఆకులకు అప్లై చేసుకోవాలి. తర్వాత దోమలు ఉన్న గదిలో బిర్యానీ ఆకులను కాల్చి పెట్టాలి. బిర్యానీ ఆకు కాల్చడం వల్ల దానికి వేపనూనె అప్లై చేయడం వల్ల ఎక్కువగా పొగ వస్తుంది. వేపనూనె, కర్పూరం వాసన దోమలకు అస్సలు నచ్చదు. ఈ పొగకి దోమలన్నీ చచ్చిపోతాయి. వేప నూనె అన్ని పచారీ కొట్టులలోనూ దొరుకుతుంది.
రెండవ చిట్కా ఈ కర్పూరం కలిపిన నూనె మట్టి ప్రమిదలో వేసుకొని దీపం పెట్టడం వలన ఎక్కువగా పొగ వస్తుంది. ఈ పొగకు దోమలు అన్ని చచ్చిపోతాయి. పడుకోడానికి ఒక గంట ముందు ఈ దీపం పెట్టి తలుపులు వేసి పెట్టాలి. ఇలా చేసినట్లయితే దోమలు అన్ని చచ్చిపోతాయి.
మూడవ చిట్కా కొన్ని వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని వెల్లుల్లి ముక్కలను, ఒక గ్లాసు నీళ్ళు వేసి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ నీటిని వడకట్టుకుని స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి. ఈ వాటర్ ని దోమలు ఉన్న చోట స్ప్రే చేయడం వలన దోమలు చచ్చిపోతాయి.
నాలుగవ చిట్కా వెల్లుల్లి రెమ్మలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు కొబ్బరి నూనె వేసి బాగా మరిగించుకోవాలి. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలన్నీ కొబ్బరినూనెలో దిగుతాయి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి చల్లారిన తర్వాత గాజుసీసాలో స్టోర్ చేసుకోవాలి. ప్రతిరోజు పడుకునే ముందు కాళ్ళు మరియు చేతులకు అప్లై చేసుకోవడం వలన దోమలు కుట్టకుండా ఉంటాయి. నైట్ డ్యూటీలు చేసే వారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి వాసన మనకు తినడానికి బాగానే ఉంటుంది. కానీ దోమలకు ఈ వాసన అంటే అస్సలు పడదు. వెల్లుల్లి వాసన రావడం వల్ల దోమలు చుట్టుపక్కలకు కూడా దరిచేరవు.