ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరి చర్మం పెడుసు బారినట్లు లేదా జిడ్డుగా తయారవుతుంది. దీనికోసం ఎన్నో రకాల మాయిశ్చరైసర్లు ఉపయోగిస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా ఎన్నోరకాల కెమికల్ సహిత ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నాం. వీటివలన చర్మం ఇంకా పాడవుతుంది తప్ప మంచి ఫలితాలు కనిపించడం లేదు. అంతేకాకుండా చర్మం పొల్యూషన్ వలన మరియు సన్ టాన్ వలన నల్లగా మారిపోతుంది. దీని కోసం పార్లర్ చుట్టూ తిరుగుతు టాన్ రిమూవర్ ప్యాక్ అని ఉపయోగిస్తున్నారు. అయినా చర్మం కొన్ని రోజుల వరకే అలా ఉంటుంది.
కనుక ఎన్ని ఉపయోగించిన తాత్కాలిక ఫలితం లభిస్తుంది గాని, శాశ్వత ఫలితం లభించదు. దీనికోసం ఇంట్లో లభించే మూడు పదార్థాలతో ఒక న్యాచురల్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇది నాచురల్ ప్యాక్ కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందువలన దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా మనం టమాటో ప్యూరీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మన చర్మంపై అప్లై చేసుకోవాలి. టమాటో లో ఉండే విటమిన్ సి వలన చర్మం పై ఉన్న మృతకణాలు తొలగించబడతాయి.
అంతేకాకుండా చర్మం స్మూత్ గా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పెరుగు మన చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. మరియు చర్మం యొక్క నిగారింపును పెంచుతుంది. ఇందులో పసుపు వేసుకుంటున్నాం. ఈ పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. కనుక చర్మం పై ఉన్న మొటిమలను తొలగిస్తుంది.
అంతేకాకుండా చర్మం మెరిసేటట్లు చేస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన చర్మం పై అప్లై చేసుకుని అరగంట సేపు తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజు చేయడం ద్వారా చర్మం చాలా ఫ్రెష్ గా మరియు స్మూత్ గా ఉంటుంది. మరియు మెరుస్తూ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఉపయోగించుకోవడం వల్ల చర్మంపై ఉన్న టాన్ కూడా పూర్తిగా తొలగించబడుతుంది. కనుక తెల్లగా మారతారు…