Get Soft Pink Lips with esay home remedies

ఒక్కసారి దీన్ని అప్లై చేస్తే చాలు నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి

చాలామందికి పెదవులు నల్లగా మారి పొట్టు రాలుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో జీవం కోల్పోయి, పెదాలు పగిలి నల్లగా మారి పెదాల నుండి నొప్పి, రక్తం వస్తుంది. అయితే ఈ సమస్య నివారించేందుకు ఎక్కువగా నీటిని తాగడంతో పాటు ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటించడం వలన పెదవులకు కావలసిన తేమ అందుతుంది. పెదవులు తాజాగా, ఎర్రగా మారుతాయి. పెదవులపై పిగ్మెంటేషన్ తొలగిపోయి పెదవులు మంచి పింక్ రంగులోకి మారేందుకు సహాయపడుతుంది. దాని కోసం మనం ఒక స్పూన్ పంచదార తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేనప్పుడు కొబ్బరి నూనె లేదా బాదం ఆయిల్ ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ తేనె కూడా వేసుకోవాలి. 

ఇప్పుడు మూడింటిని బాగా కలిపి ఒక ప్లాస్టిక్ బాక్స్ లో నిల్వ చేసుకోవచ్చు. ఇది మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. తర్వాత చిట్కా కోసం దాల్చిన చెక్క పొడి ఉంటే దాన్ని వాడుకోవచ్చు. లేదంటే దాల్చిన చెక్కలను మిక్సీలో మెత్తగా పొడి చేసి చెల్లించుకుని మెత్తని పొడిని తీసుకోవాలి ఒక చిన్న గిన్నెలో వేసి రెండు చెంచాల దాల్చినచెక్క పొడి వేసి అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె ఒక స్పూన్ వ్యాస్లీన్ పెట్రోలియం జెల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపి స్టవ్పై ఒక గిన్నె లో నీళ్ళు పెట్టుకోవాలి. ఈ మూడు పదార్థాలు ఉన్న చిన్న గిన్నెను ఈ నీటిలో పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకోవాలి.

 పెట్రోలియం జెల్లీ కరిగి మిశ్రమం ద్రవరూపంలో మారుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు. ప్రతిరోజు ముందుగా తయారు చేసుకున్న లిప్ స్క్రబ్ తో పెదాలను ఒక నిమిషం పాటు స్క్రబ్ చేసి తరువాత దాన్ని శుభ్రం చేసి అప్లై చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మృతకణాలు తొలగిపోయి మంచి రంగు వస్తుంది. పెదాలు పొడిబారకుండా లిప్ బామ్ అడ్డుకుంటుంది. ఈ లిప్బామ్ అబ్బాయిలు కూడా వాడవచ్చు. దీనిలో ఎటువంటి కలర్ లేదు గనుక పెదాలు పొడిబారకుండా ఉంటాయి. క్రమంగా నలుపు రంగు తగ్గి పెదాలు మంచి రంగు లోకి వస్తాయి.

Leave a Comment

error: Content is protected !!