చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం మనల్ని ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే బయట అనారోగ్యపరిస్థితులకు చెడిపోతున్న ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా జుట్టుకు రంగులు వేసేంత. ఎందుకంటే జుట్టు మన అందానికి ప్రతీకగా కనిపిస్తుంది కనుక. తెల్లవెంట్రుకలు రాగానే అందరూ ముసలివాళ్ళు అయిపోయినంత బాధపడతారు. అలాంటి రంగులు వేసే క్రమంలో మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ అందుబాటులో కొచ్చాయి. ఒకప్పుడు రంగులూ వేయాలంటే ఒక బౌల్లో కలపాలి. బ్రష్ తో వేసేందుకు వేరొకరి సహాయం తీసుకోవాలి లేదా మనమే అద్దాలతో విన్యాసాలు చేయాలి. కానీ ఇప్పుడు జుట్టుకు రంగేయడం ఎంత సులువుగా మారిందంటే షాంపూ చేసినట్టు చేయడమే. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
ఇంత ఈజీగా చేసే ఈ పద్థతిలో కూడా నష్టాలు ఉన్నాయి. ఇందులో అమ్మోనియా, పెరాబెన్స్, పీపీడిఎ వంటి రసాయనాలు ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ పడకపోవడం వలన చర్మంపై దురద, ఎర్రగా మారడం వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీటినుండి ఉపశమనం కోసం కొబ్బరినూనె రాయాలి. కొబ్బరినూనెతో రంగువలన వచ్చే దురద , ఎర్రగా మారడం అలర్జీ తగ్గుతుంది. రంగువేసిన తర్వాత అలర్జీ వచ్చిన ప్రాంతంలో కొబ్బరినూనె రాసుకోవాలి. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవిలో గులుము, బొడ్డులో మట్టి తొలగించడం కోసం వాడే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ను కూడా రంగువేసిన తర్వాత రాయాలి. స్నానం చేసినప్పుడు కడిగేయాలి. ఇలా వాడడంవలన కూడా ఇటువంటి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.
కొంచెం పెద్దవారిలో అయితే రంగులు పర్లేదు కానీ చిన్నవయసువారిలో ఇలా రంగులు వేయడం ప్రమాదమే కదా. వారికోసం సహజ పద్థతి తెలుసుకుందాం. ఇక జుట్టును నల్లగా మార్చుకోవడానికి సహజంగా హెన్నా (గోరింటాకు) వాడొచ్చు. గోరింటాకు వలన జుట్టు ఎర్రగా మారుతుంది. నల్లని జుట్టులో అక్కడక్కడా ఎర్రజుట్టు కలిసిపోతుంది. సహజంగా తెల్లజుట్టు నల్లజుట్టుగా మారే అవకాశం లేదా అంటే నీలిమందు(ఇండిగో) చెట్టు పువ్వులను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిని హెన్నాతో కలిపి పెట్టడంవలన జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. ఇవి నాచురల్ ప్రోడక్ట్స్ కావడంవలన ఎటువంటి దుష్ప్రభవాలు ఉండవు. అందుకే వీలైనంత సహజంగా ఈ పదార్థాలు వాడి జుట్టును నల్లగా చేసుకోవడం మంచిది.