ప్రజలు క*రోనా వలన పడ్డ ఇబ్బందులు మామూలువి కాదు. అనేక మంది ప్రాణాలు కోల్పోతే మరికొంత మంది తమ తాహతుకు మించి ధనాన్ని ఖర్చు పెట్టారు. అందరూ క*రోనాకి ఎంత భయపడ్డారో ఇప్పుడు క*రోనా వాక్సిన్ కి కూడా అంతే భయపడుతున్నారు జనాలు. వాక్సిన్ కోసం ఎంత ఎదురుచూసారో ఇప్పుడు కొంతమంది వాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చే దుష్పభవాలు గురించి బయటకు చెప్పడంతో అవి క*రోనా లక్షణాలకు దగ్గరగా ఉండడంతో వాక్సిన్ అంటే కూడా అంతే భయపడుతున్నారు.
వాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా క*రోనా రావడంతో ఈ ఇబ్బందులు పడడం ఎందుకని చాలామంది వెనుకంజ వేస్తున్నారు. కానీ వాక్సిన్లు వేసుకున్న వారికి క*రోనా వస్తుందా అంటే వస్తుంది. కానీ వాక్సిన్ వేసుకున్న తర్వాత వారిలో యాంటీబాడీస్ అధికంగా ఉండడంతో త్వరగా కోలుకుంటున్నారు. వాక్సిన్ వలన చిన్నపాటి దుష్పభవాలు పారాసిటమాల్ టాబ్లెట్ తో తగ్గిపోతున్నాయి. రెండు రోజుల్లో కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్స్ సహాయం తీసుకోవడం మంచిది.
మామూలు మనుషులు వాక్సిన్ వేసుకున్నపుడు వారిలో ఉన్న యాంటీబాడీస్ కంటే వాక్సిన్ వేసుకున్న వారిలో క*రోనా సోకితే వారిలో ఉన్న యాంటీ బాడీస్ చాలా అధికంగా ఉన్నట్టు డాక్టర్లు గమనించారు. అందుకే ఎవరికైనా వాక్సిన్ అందుబాటులో ఉంటే తప్పక తీసుకోండి. వాక్సిన్ వలన వచ్చే దుష్పభవాలు కొంచెం ఇబ్బంది పెట్టినా తర్వాత లాభాన్ని అందిస్తున్నాయి.
వాక్సిన్ వేయించుకున్నవారికి క*రోనా వస్తే రెండో డోస్ వేసుకోవలసిన అవసరం లేదని వారిలో సంవత్సరం వరకూ యాంటీబాడీస్ ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా వాక్సిన్ వేయించుకున్నవారిలో క*రోనా వస్తే రెండవ డోస్ వేసుకోకపోవడం వలన మనకు లాభం మరియు అది వేరోకరికి ఉపయోగపడడంతో గవర్నమెంట్ కూడా లాభపడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రక్షణ అందించినట్టు ఉంటుంది. అందుకే వాక్సిన్ ఫ్రీగా అందుబాటులో ఉంటే తప్పక వేయించుకోండి. కొన్ని ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు కనీస ధరతో వాక్సిన్ డ్రైవ్ చేస్తున్నాయి. అలా అయినా తీసుకోవడంవలన మనకు క*రోనా నుండి ఉపశమనం దొరికినట్టే.