హలో ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి ముందుగా మనం తినే తాగే ఆహార పదార్థాల పైన ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసే ఉంటుంది. తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టే వారు ముఖ్యంగా అవాయిడ్ చేసే ఆహారాలలో కారం మరియు మసాల పదార్థాలు ముఖ్యంగా ఉంటాయి. కారంగా ఉండే అన్ని పదార్థాలు మన ఆరోగ్యానికి చెడు చేస్తాయి అని కాదు అందులో కొన్ని మన ఆరోగ్యానికి మంచి కూడా చేస్తాయి అలాంటి వాటిలో ఒకటి పచ్చిమిరపకాయ. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ తినటం వలన మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
కారంగా ఉండే పదార్థాలు మన శరీరానికి మంచిది కానపుడు పచ్చిమిరపకాయ మాత్రం ఎలా మంచిదవుతుందనే సందేహం మీకు కలగొచ్చు. ముందుగా మనము ఎండుమిరపకాయ (కారం పొడి) గురించి తెలుసుకుందాం. ఈ కారంపొడి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే మసాలాలు ఉండే పదార్థాలు మన ఆరోగ్యానికి శరీరానికి అంత మంచిది కాదు. పూర్తి వివరాలకు ఈ వీడియో చుడండి.
పచ్చి మిరపకాయ్ అంటే చాలామంది భయపడుతుంటారు దీనికి గల కారణం కారం. మనలో చాలామంది పచ్చిమిరపకాయలు వంటల్లో కేవలం కారం కోసమే అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆయుర్వేదం ప్రకారం పచ్చిమిరపకాయలలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
ప్రతిరోజూ ఒక పచ్చి మిరపకాయ తింటే మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఎవరైతే పిల్లలు కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు ప్రతిరోజు ఒక్క పచ్చిమిరపకాయ తినిపించి చూడండి నెల రోజుల్లో ఒకటి లేదా రెండు ఐ సైట్ నెంబరు తగ్గుతుంది. అదే మీరు మూడు నుంచి నాలుగు నెలలు ప్రతి రోజు తప్పకుండా ఒక్క పచ్చి మిరపకాయ తింటే మీ కళ్ళజోడు తీసి పక్కన పడేసాడు. ఇందులోని విటమిన్ ఎ కంటి చూపును కూడా పెంచుతుంది.

ఈ పచ్చిమిరపకాయలలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది ఒక అర కప్పు తరిగిన పచ్చిమిరపకాయలలో కనీసం 180 మిల్లీ గ్రాముల విటమిన్ సి లభిస్తుంది అంటే మన శరీరానికి ఒక్క రోజుకు సరిపడా విటమిన్-సి దొరుకుతుంది. ఇది మన శరీరంలో ఇమ్యూనిటీపవర్ ని పెంచుతుంది అంతేకాకుండా హైపర్టెన్షన్ కూడా అడ్డుకుంటుంది. ఎవరికైతే లోబిపి ప్రాబ్లం ఉంటుందో, మరీ ఎక్కువగా టాబ్లెట్స్ మీద ఆధారపడి ఉంటారో అలాంటి వారికి కూడా పచ్చిమిరపకాయ మంచి ఔషధంలా పనిచేస్తుంది. పచ్చి మిరపకాయ మీ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది.
మన శరీరంలో రక్తాన్ని పెంచుకోవడానికి ఐరన్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు అలాంటి వారు ప్రతి రోజూ ఒక పచ్చిమిర్చి తింటే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఐరన్ శాతం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఎర్ర రక్త కణాలను వృద్ధి చేసి గుణం ఉంటుంది. దీని వల్ల మన శరీరంలో రక్తహీనత తగ్గుతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తం కూడా బాగా పెరుగుతుంది. పచ్చిమిరపకాయలు మన శరీరం లోని రక్త ప్రసరణను మెరుగు పరిచే గుణాలు కలిగి ఉంటాయి.
పచ్చిమిరపకాయ జీర్ణశక్తిని కూడా పెంచుతుంది అజీర్తిని తొలగించి పక్షవాతాన్ని తగ్గిస్తుంది రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాదు మన ఆకలిని కూడా పెంచుతుంది. మనకు దెబ్బ తగిలినప్పుడు రక్తం ఆగకుండా ఉంటే వెంటనే పచ్చిమిర్చి తింటే చాలు ఇది కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు లను కూడా తగ్గిస్తుంది ఇవి మన ఎముకలు పుష్టిగా ఉంచి మన ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది.
డయాబెటిస్తో బాధపడేవారికి పచ్చిమిరపకాయ ఒక వరం లాంటిది ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా మీ డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
ప్రతిరోజు పచ్చిమిరపకాయలు తినటం వలన భయంకరమైన క్యాన్సర్ లాంటి అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు దూరంగా ఉండవచ్చు. పచ్చిమిరపకాయలు యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. దీని ద్వారా మనకు stomach క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంచుకోవచ్చు.
పచ్చిమిరపకాయ మన గుండెకు కూడా చాలా మంచిది. ఇది మన రక్తాన్ని మందంగా చేస్తుంది రక్తంలో ఉండే ఎసిడిటీని కూడా కంట్రోల్లో ఉంచి రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దీని ద్వారా మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డబ్ల్యూహెచ్వో రీసెర్చ్ ప్రకారం మన దేశంలో ప్రతి మూడు సెకన్లకు ఒక వ్యక్తి హార్ట్ ఎటాక్ సమస్యతో మరణిస్తున్నారు. ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ ఒక పెద్ద అనారోగ్య సమస్యగా మారింది. అందుకే మన గుండె ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. పూర్వం రోజుల్లో హార్ట్ఎటాక్ ఒకసారి రెండుసార్లు వచ్చిన తట్టుకునేవారు కానీ ప్రస్తుత కాలంలో మొదటి అటాక్ లోని చాలా మంది మరణిస్తున్నారు. ఈ పచ్చిమిరపకాయలు మన గుండె ఆరోగ్యాన్ని కాపాడి హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి. అందుకే మనము ఖచ్చితంగా పచ్చిమిరపకాయని మన ఆహారంలో భాగంగా చేసుకుని తినాలి.
పచ్చిమిరపకాయలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడతాయి. ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జలుబు దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను సులభంగా నివారిస్తాయి. అలాగే డెంగ్యూ చికెన్ గునియా రాకుండా మనల్ని దూరంగా ఉంచుతాయి. రోజు ఒక పచ్చి మిరపకాయ తినడం వల్ల మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. దీని ద్వారా మీరు ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నైనా ఎదుర్కొని బయటపడవచ్చు.
పచ్చిమిర్చిలో కెరోటిన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మన చర్మాన్ని ముడతలు లేకుండా మనకు వృద్ధాప్య లక్షణాలు త్వరగా రానివ్వకుండా చేస్తుంది. పచ్చిమిర్చిలో క్యాలరీలు 0 కాబట్టి మీరు సులువుగా బరువు కూడా తగ్గవచ్చు. అలాగే మనం అందంగా ఉండటానికి ఎండార్ఫిన్లు అనే హార్మోన్ చాలా అవసరం.ఈ పచ్చి మిర్చి లో ఈ హార్మోను పుష్కలంగా ఉంటుంది. పచ్చి మిర్చి తినడం వల్ల మన అందాన్ని మూడ్ని మార్చడానికి కూడా దోహదపడతాయి.