ప్రస్తుత మన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంది. ముసలి వాళ్ళ అయితేనే తెల్ల వెంట్రుకలు వచ్చేవి. కానీ ఇప్పుడు పాతికేళ్ల వయసు వచ్చేసరికి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. తెల్ల వెంట్రుకలు దాచిపెట్టడం కోసం కెమికల్స్ ఉన్న ఎన్నో రకాల రంగులను ఉపయోగిస్తూ ఉంటాము. కానీ వాటి వల్ల తెల్ల జుట్టు ఇంకా పెరిగిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ నూనె తయారు చేసుకుని రాసినట్లయితే తెల్లగా వచ్చిన జుట్టు కూడా నల్లగా మారిపోతుంది.
ఈ నూనె తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. దానిలో ఒక కప్పు ప్యారాచూట్ కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె జుట్టు కుదుళ్ల నుండి పిగ్మెంటేషన్ తగ్గించి తెల్ల వెంట్రుకలు రాకుండా, జుట్టు కుదుళ్ళు గట్టిపడే లాగా చేస్తుంది. దీనిలో నాలుగు రెమ్మలు శుభ్రంగా కడిగిన కరివేపాకు లేదా కరివేపాకు పొడిని కూడా ఉపయోగించవచ్చు.
కరివేపాకులో అయోడిన్, సెలీనియం, జింక్, మాంగనీస్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. మనం కరివేపాకు ఆహారంలో కూడా ఎక్కువగా తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ కలోంజీ విత్తనాలు వేసుకోవాలి. కలోంజీ విత్తనాలు జుట్టు నల్లబడటంలో, జుట్టు రాలే సమస్య తగ్గించడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. బ్లాక్ సీడ్ ఆయిల్ జుట్టు నెరసిపోకుండా నిరోదిస్తుంది. ఇది మీ ఫోలికల్స్‌లోని వర్ణద్రవ్యం కణాల తగ్గింపును నిరోధించే లినోలెయిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది.వృద్ధాప్యంతో, వెంట్రుకల కుదుళ్లు మెలనిన్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తాయి మరియు ఇది జుట్టు నెరసిపోవడానికి కారణం కావచ్చు.
బ్లాక్ సీడ్ ఆయిల్ హెయిర్ ఫోలికల్స్‌ను పునరుజ్జీవింపజేస్తుంది. పోషకాలు మొత్తం నూనెలోకి దిగేంతవరకు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లార్చుకోవాలి. ఈ నూనెను వడకట్టుకుని ఏదైనా సీసాలో స్టోర్ చేసుకుని రోజు రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వలన తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. తెల్ల వెంట్రుకలు బాగా ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ నూనె ఓపికగా చేసుకుని రాసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది.
దీనిలో మనం పారాచూట్ కొబ్బరి నూనె ఉపయోగించాము. దానికి బదులుగా గానుగ దగ్గర పట్టించిన కొబ్బరి నూనె ఐతే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చిన వారు రకరకాల హెయిర్ డైలు వాడతారు. కానీ వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ నాచురల్ ఆయిల్ ఉపయోగించడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.