ఆరోగ్యకరమైన జుట్టు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ దానికి సరైన శ్రద్ధ చాలా అవసరం. కానీ మన బిజీ లైఫ్ లో అంత శ్రద్ధ తీసుకోవడం చాలా కష్టం. కొంతమంది అధిక ఒత్తిడి, కాలుష్యం వంటి వాటి వలన జుట్టు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు జుట్టు గురించి శ్రద్ధ తీసుకోవడం ఇప్పుడైనా మొదలుపెట్టాలి. దాని కోసం మనం ఇప్పుడు ఒక మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు అన్ని మనకు అందుబాటులో ఉండేవి, అతి తక్కువ ఖర్చుతో లభించేవే. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తమలపాకులు మనకి అన్ని రకాల పాన్ షాపుల్లో, పువ్వుల షాపుల్లో అందుబాటులో ఉంటాయి. వాటిని తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తమలపాకులను కోసినప్పుడు, వేరే ప్రదేశాలకు తరలించేటప్పుడు కిందన వేసినప్పుడు మట్టి వంటివి అంటుతాయి. అందుకే శుభ్రంగా కడగి ఆరబెట్టాలి. తర్వాత వీటిని పెద్ద ఆకులైతే 1చిన్నవైతే 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తమలపాకులు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ ఆకులను ఉపయోగించడానికి మరొక మార్గం ఏమిటంటే, ఈ ఆకులను రుబ్బి యాంటీ-హెయిర్ ఫాల్ మాస్క్‌లా అప్లై చేయడం.
తర్వాత ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు తీసి పెట్టుకోవాలి ముడి వెల్లుల్లిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ఉత్తేజపరిచే కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. వెల్లుల్లిలో సెలీనియం కంటెంట్ ఉండటం వలన గరిష్ట పోషణ కోసం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తర్వాత పదార్థం మెంతులు మెంతులు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించి చుండ్రు నిరోధకతకు సహకరిస్తుంది. జుట్టు పొడవుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది.
ఇప్పుడు హెయిర్ ఆయిల్ తయారీ కోసం ఒక గిన్నెలో 200 ml కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ వేసుకొని బాగా మరిగించి నూనెను తయారుచేసుకోవాలి. బాగా మరిగిన తరువాత స్టవ్ ఆపేసి నూనెను చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత మీ జుట్టుకు తగినంత నూనె తీసి తలకు అప్లై చేసి మునివేళ్ళతో తలకు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నూనెలోని పోషకాలు పుష్కలంగా అందుతాయి. వారానికి కనీసం రెండు రోజులు ఇలా అప్లై చేయడం వల్ల జుట్టు పొడవుగా దృఢంగా పెరుగుతుంది.