Grow-Your-Hair-in-a-Week

పైసా ఖర్చు లేకుండా ఈ ఆయిల్ జుట్టుకు పట్టించండి, జుట్టు ఊడకుండా పెరుగుతుంది

ఈ మధ్య కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వలన  జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. తగ్గించుకోవడానికి రకరకాల మందులను, మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తాము. వాటివల్ల ప్రయోజనం ఉండకపోగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే  ఎటువంటి కెమికల్స్ లేని మన వంటింట్లో ఉండే నేచురల్  ఇంగ్రిడియంట్స్ తో  ఆయిల్స్,హెయిర్ ప్యాక్స్  తయారు చేసుకుని  ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. 

     దీనిని తయారు చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు 50ml కొబ్బరినూనె, రెండు చెంచాల లవంగాలు,  రెండంగుళాల అల్లం ముక్క. ముందుగా అల్లం   లవంగాలు మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు గ్రేటర్ సహాయంతో మెత్తగా  తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని లవంగాల పొడి మరియు అల్లం పేస్టు వేసుకోవాలి.  దీనిలో 50 ml కొబ్బరి నూనె వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. అల్లంలో ఉండే తడి మొత్తం ఇంకి  పోయేంతవరకు నూనె  మరిగించుకోవాలి. 

          తర్వాత స్టౌ ఆఫ్ చేసి నూనెను చల్లార్చుకోవాలి చల్లారిన నూనెను వడగట్టుకుని ఏదైనా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను తలస్నానం చేయడానికి ఒక గంట ముందు అప్లై చేసి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. ఒక గంట తర్వాత ఏదైనా హోమ్ మేడ్ షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. 

        దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్, జింక్, కాపర్, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల జుట్టు రాలడం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. లవంగాల లో కూడా జుట్టు రాలడం తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. లవంగ నూనె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  సామాన్యులకు లవంగనూనె దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అది చాలా ఖరీదైనది. అందువల్ల కొబ్బరినూనె లవంగాలను పౌడర్ చేసి వేయడం వలన లవంగాల లో ఉండే ప్రాపర్టీస్ నూనెలోకి వస్తాయి. ఇది కూడా జుట్టు రాలడం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!