గుంటగలగర అయిర్వేదంలో ఒక దివ్యమైన ఔషధ మొక్క. చేల గట్ల వెంట, చెరువు గట్ల వెంట ఈ మొక్క విరివిగా పెరుగుతుంది. ప్రతి గ్రామంలో ఈ మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఒక్కసారి ఈ గుంటగలగర గూర్చి తెల్సుకుందాం.
భృంగరాజ్
చాలామందికి గుంటగలగర అంటే తెలియకపోవచ్చు కానీ భృంగరాజ్ అంటే తప్పక తెలిసి ఉంటుంది. నేటి కాలంలో జుట్టు సమస్యలకు ఎక్కువగా ఉపయోగిస్తున్న తైలం భృంగరాజ్ తైలమే మరి. అయితే దీన్ని బయట కొని వాడుకోవడం వల్ల అందులో భృంగరాజ్ గుణాలు ఎంతమేరకు ఉన్నాయో చెప్పలేం అందుకే గుంటగలరాకు సేకరించి స్వయంగా తైలం చేసుకుని వాడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుంటగలగర లేదా భృంగరాజ్ తైలం తయారు విధానం చూడండి.

భృంగరాజ్ తైలం
ఆరోగ్యకరంగా పెరిగిన గుంటగలగర మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దాన్ని మిక్సీలో వేసి రసం తీయాలి. దీనికి ఎలాంటి నీళ్లు కలపకుండా రసం తీస్తే చాలా మంచిది. గుంటగలగర రసానికి సమానంగా కొబ్బరి నూనె లేక నువ్వుల నూనె తీసుకుని మందం పాటి కడాయిలో వేసి చిన్న మంటమీద రసం ఇగిరిపోయేవరకు మరిగించాలి. తరువాత చల్లారాక వడపోసి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. రోజు ఉపయోగించే కొబ్బరి నూనెకు బదులుగా ఈ భృంగరాజ్ తైలం ను కుదుళ్లకు పట్టేలా పెట్టుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల తెల్లవెంట్రుకలు పోయి నెలలుగా మారుతాయి. అలాగే భృంగరాజ్ చూర్ణం గూర్చి ఒకసారి చూడండి.
భృంగరాజ్ చూర్ణం
పై చెప్పుకున్న విధంగా ఆరోగ్యంగా పెరిగిన గుంటగలగర మొక్కను తెచ్చి శుభ్రపరచి నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరిపోయిన తరువాత దాన్ని మెత్తని చూర్ణంగా చేసుకోవాలి. ఈ చూర్ణానికి సమానంగా పటికబెల్లం(కలకండ లేదా కండచెక్కెర) ను కలిపి మెత్తగా దంచుకోవాలి. ఈ చూర్ణాన్ని రోజు ఒక అరస్పూన్ మోతాదుగా నోట్లో వేసుకుని చప్పరించాలి. దీనివల్ల లోపలి భాగాలలో గుంటగలర సారం చేరి జుట్టును తొందరగా నల్లబరుస్తుంది. అలాగే కంటి చూపును మెరుగు పరుస్తుంది.
అంతే కాదు గుంటగలగరను రోజు వారీ ఆహారంలో తీసుకోవచ్చు. పప్పు లా కందిపప్పుతో కలిపి వండుకోవచ్చు, గోంగూర పచ్చడిలా తయారు చేసుకుని తినవచ్చు. ఇది కేవలం జుట్టుకు, కళ్ళకు మాత్రమే కాకుండా మన శరీరంలో కాలేయాన్ని సంరక్షిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
చాలా బాగుంది