జుట్టు సమస్యలు, జుట్టు రాలిపోవడం ముక్కలుగా తెగిపోవడం, చివర్లు చిట్లడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికి మూల కారణాలు, పరిష్కారాల గురించి తెలుసుకుందాం చిన్న వయసులోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటే వాళ్లు కొన్ని రకాల టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. అందులో కొన్ని థైరాయిడ్, విటమిన్ బీ 12, విటమిన్ డి లోపం ఉన్నవారిలో నా ఈ జుట్టు రాలే సమస్యలు, జుట్టు ఊడిపోవడం, బట్టతల రావడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
థైరాయిడ్, విటమిన్ బి 12 లోపాలు ఉన్నట్లయితే ప్రారంభ దశలో థైరాయిడ్ కి మందులు వాడడం ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే విటమిన్ బి12 ఆహారం ద్వారా తీసుకోవచ్చు. లేకపోతే డాక్టర్ సూచించిన మందులు అధిగమించవచ్చు. విటమిన్ డి ఎండ ద్వారా లభిస్తుంది. ఎండలోకి వెళ్లే అవకాశం లేనప్పుడు నెలకు 1 విటమిన్-డి టాబ్లెట్ వేసుకో వచ్చు. చుండ్రు సమస్యలు తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వారు రోజూ తల హస్నానం చేయడం వలన వాటి నుండి బయట పడవచ్చు. అలా కుదరని వారు రోజు తప్పించి రోజు తల స్నానం చేయవచ్చు.
తలస్నానానికి బాగా వేడి నీళ్లను ఉపయోగించకూడదు. కనీసం 40 డిగ్రీల లోపల నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించాలి. చాలా వేడి ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు డ్రై అయిపోయి జుట్టు విరిగిపోవడం, రాలిపోవడం సమస్య మొదలవుతుంది. ప్రోటీన్ ఫుడ్ అందించడం ద్వారా కూడా జుట్టు సమస్యలను అధిగమించవచ్చు. దానికోసం రోజు లేదా గుప్పెడు పుచ్చ పప్పు లేదా బాదం పప్పులను నానబెట్టి తినడం వలన మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందుతాయి.
సోయా పదార్ధాలకు సంబంధించిన సోయా చిక్కుడు గింజలు, మిల్ మేకర్, సోయా ఫ్లేక్స్ వంటివి వారంలో రెండు సార్లయినా తీసుకుంటూ ఉండాలి. రోజు ఏదో ఒక పప్పు ఆకుకూర కలిపి తీసుకోవడం వలన రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. పుట్టగొడుగులలో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. వీటిని కనీసం వారంలో రెండు సార్లయినా తీసుకోవడం వలన విటమిన్ బి 12 లోపంని తగ్గించుకోవచ్చు.
మనం రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, నీరు ఎక్కువగా తీసుకోవడం వలన జుట్టు చర్మ సమస్యలను రాకుండా అడ్డుకోవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల సమస్యను ఇతర ఏ పరిష్కారం జుట్టును తిరిగి మొలిపించే అవకాశం లేదు. కేవలం ఆధునిక పద్ధతులు వలన జుట్టు ను అమర్చుకోవడం తప్ప.