Hair Care Tips For Everyone in Winter

శీతాకాలంలో ఈ చిట్కాలే…జుట్టుకు బెస్ట్ ఫ్రెండ్స్…

వాతావరణం వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా మన జుట్టు పైన ఎంతో ప్రభావం చూపుతుంది. ఎండాకాలంలో కన్నా శీతాకాలంలో జుట్టుని సంరక్షించుకోవడం చాల కష్టమైన విషయం. ఈ కాలంలో చుండ్రు ఎక్కువగా బాధిస్తుంది.  ఒకటే దురద, తల స్నానం చేసినా ఎక్కువగా ప్రయోజనం కనిపించదు, తల పొడిగా మారడం వలన, చుండ్రు భుజాల మీదకు రాలడం,ఎంతో అసహ్యంగా కనిపిస్తంది.

మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి ? ఈ క్రింది చిట్కాలను పాటిస్తే సరి…

స్నానానికి ఒక గంట ముందు, తలకు గోరు వెచ్చని కొబ్బరి నూనె కాని, ఆలివ్ ఆయిల్ కాని రాసుకొని బాగా మర్దన చేసుకోవాలి.. దీని వలన తలకు మంచి రక్తప్రసరణతో పాటుగా జుట్టు బలంగా వత్తుగా, తయారవుతుంది. దీంతో చుండ్రు నివారణ కూడా జరుగుతుంది.

షాంపూ ఎక్కువగా వాడటం కారణంగా జుట్టు మాయిశ్చరైజర్ ను కోల్పోతుంది.. అందుకే. మితంగా వారనికి ఒకటి రెండు సార్లు మాత్రమే షాంపూ చేయండి.. అయితే…

యాంటీ డాండ్రఫ్ షాంపూలో  చుండ్రుకు ప్రభావంతంగా పనిచేసే గుణాలు ఉంటాయి.. ముఖ్యంగా టీ ట్రీ ఆయిల్,  జింక్, విటమిన్ బి, ఒమేగా 3,ఫ్యాటీ యాసిడ్స్, కలిగి ఉన్న షాంపూలే ఎంపిక చేసుకోవాలి. క్రమం తప్పకుండా .. కొన్ని నెలలు వాడితే.. చుండ్రు పూర్తిగా పోతుంది.. జుట్టు నిగనిగ లాడుతూ… అందంగా తయారవుతుంది..

మీరు తినే ఆహరంలో చిన్న చిన్న మార్పులు చేస్తే.. చుండ్రుని నివారించుకోవచ్చు. సరైన విటమిన్ లు , పోషక విలువలు కలిగిన తాజా కూరగాయలు.. పండ్లు..నట్స్, ప్రోటీన్స్, ఫ్యాటీ రిచ్ ఫుడ్స్  తినడం వల్ల చుండ్రుకు కారణమయ్యే ఇతర సమస్యలను అరికడుతూ..తలలో ఇన్ఫ్క్షన్స్, బాక్టీరియాను నివారిస్తాయి. అయితే.. షుగర్, హై ఫ్యాట్ ఫుడ్స్ కి దూరంగా ఉంటేనే చుండ్రు నివారణలో ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది.

సూర్యరశ్మి మన శరీరానికి విటమిన్ డి ని అందించి ఎంతో మేలు చేస్తుంది… అయితే.. ఇవే సూర్యకిరణాలు.. మన జుట్టులో.. చుండ్రుకు కారణం అవుతాయి.. సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు ఇటు చర్మానికి ముఖ్యంగా జుట్టుకి.. కీడు కలిగిస్తాయి.. వీలైనంత వరకు ఎండలో బయటకు వెళ్ళడం మానెయ్యాలి.. అలా కాని పక్షంలో.. క్యాప్ లేదా స్కార్ఫ్ ధరించి వెళ్ళాలి..

ఆల్కాహాల్ కలిసిన హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులకు దూరంగా ఉంటేనే మంచిది.. హెయిర్ సెరమ్ నుంచి… హెయిర్ జెల్ వరకు వాడుతుంటాము.. వీటి వల్ల జుట్టు తేమను కోల్పోయి మరింత పొడిబారి చుండ్రు అధికం అవుతుంది..

Leave a Comment

error: Content is protected !!