హలో ఫ్రెండ్స్ ఈ రోజు జుట్టురాలే సమస్యకు మన ఇంట్లో ఉండే మెంతులతో ఒక మంచి టిప్ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో 40 ఏళ్లు పైబడితే చాలు బట్టతల వచ్చేస్తుంది. అంతేకాకుండా చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. మెంతులు లేని వంటిల్లు ఉండదేమో కదా. మెంతులు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మన కేశ సంరక్షణకు కూడా బాగా పనిచేస్తాయి.
ముందుగా మీ జుట్టుకు తగినంత రెండు లేదా మూడు స్పూన్ల మెంతులను ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మెంతుల్లో ఒక గ్లాసు నీరు పోసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్ని స్టవ్ మీద ఈ మెంతులను నీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించండి. ఇలా చేయడం వల్ల మెంతుల్లోని గుణాలన్నీ నీటిలోకి బాగా ఇంకు తాయి. చల్లారిన తర్వాత ఫిల్టర్ సహాయంతో ఈ నీటిని వడ పోసుకోండి. తర్వాత ఒక అర చెక్క నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మరసాన్ని ఇందులో కలపండి. ఈ నీటిని ఒక కాటన్ బాల్ సహాయంతో లేదా లేదా స్ప్రే బాటిల్ సహాయంతో గాని మీ జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఈ నీటిని మీరు తలస్నానం చేయాలనుకునే గంట ముందు అప్లై చేయాలి. ఈ నీటిని నూనె లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీ జుట్టుకు అప్లై చేయండి. కనీసం 45 నిమిషాల నుంచి గంట సేపు అలాగే ఉంచండి. తర్వాత ఏదైనా ఆయుర్వేదిక్ లేక హెర్బల్ షాంపూతో తల స్నానం చేయండి.
మెంతులలో పోలిక్ యాసిడ్ విటమిన్ ఏ విటమిన్ కే తో పాటు పొటాషియం క్యాల్షియం ఐరన్ ఇలాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు ఎదుగుదలకు బాగా పనిచేస్తాయి
చాలామందికి హెయిర్ ఫాల్ సమస్య కి ముఖ్య కారణం డాండ్రఫ్. నిమ్మరసాన్ని వాడడం వలన జుట్టు రాలే సమస్యతో పాటు డాండ్రఫ్ సమస్య కూడా తగ్గుతుంది.