Hair Growth Challenge Reduces Hair Fall

ఎన్ని వాడినా జుట్టు పెరగడం లేదా………… ఈ పేస్ట్ ను తలకు రాయండి….. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది………

ప్రతి ఒక్కరూ వారి జుట్టు ఒత్తుగా నల్లగా నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఆశించిన విధంగా మన జుట్టు ఉండటం లేదు. దానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. అది ఒకటి పోషకాహార లోపం. రెండవదిగా మారుతున్న కాలం బట్టి పెరుగుతున్న పొల్యూషన్. కనుక మనం ఎన్ని ఉపయోగించిన పోషకాహార లోపం ఉంటే జుట్టు రాలడం అనేది ఎక్కువ అవుతునే ఉంటుంది. కనుక మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. రెండవదిగా కెమికల్ రహిత ఆయిల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది.

కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మనం జుట్టు నల్లగా ఒత్తుగా రావడానికి అన్నం టెక్నిక్ గురించి తెలుసుకుందాం. అన్నం తలకు ఉపయోగిస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. మీ జుట్టు ప్రకాశవంతంగా నల్లగా ఒత్తుగా ఉండాలి అంటే అన్నంలో ఉండే జిగురు బాగా ఉపయోగపడుతుంది. మరియు ఆముదం జుట్టు నల్లగా ఒత్తుగా దృఢంగా ఉండడానికి ఉపయోగించే మొట్టమొదటి ఆయిల్. ఈ రెండింటి కాంబినేషన్ మన జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది.

మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం మెత్తని పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ కు ఆముదం కలిపి ఈ రెండింటి మిశ్రమాన్ని జుట్టు యొక్క మాడు నుంచి చిగుర్ల వరకు బాగా మత్తుగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత అరగంట నుంచి ముప్పావుగంట సేపు లేదా ఖాళీగా ఉంటే ఒక గంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జుట్టు ఒత్తుగా, షైనీ గా, నల్లగా నిగనిగలాడుతూ  ఉంటుంది‌. మరియు జుట్టు చిక్కులు పడకుండా, లుంగలు లుంగలుగా అవ్వకుండా ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్ టు నేచర్ అన్నట్లు మరలా ఇటువంటివి మీ జుట్టుకు ఉపయోగపడతాయి.

ఇవి మన ఇంట్లోనే లభించేవి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. మరియు ఆముదం నూనెను గోరువెచ్చగా చేసుకుని తలకు పట్టించి ఆ తర్వాత పావుగంటసేపు మసాజ్ చేయడం ద్వారా కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు బాగా ఎదుగుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతతను అందిస్తుంది. కనుక ఇటువంటి చిట్కా ఉపయోగించడం ద్వారా మన జుట్టు ఎదుగుదలలో బాగా సహాయపడుతుంది……

Leave a Comment

error: Content is protected !!