hair growth home remedy with bay leaf

వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు. జుట్టు వేగంగా లావుగా, పొడవుగా ఒత్తుగా రెండురెట్లు వేగంగా పెరుగుతుంది.

జుట్టు రాలి పోవడం వలన పాపిటనుండి జుట్టు పలచన అయిపోతుందా. ఎన్ని రకాల షాంపూలు ప్రొడక్ట్స్ వాడినా ఫలితం లేకుండా ఉందా ?  అయితే ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చేసే చిట్కాలు మంచి ఫలితాన్ని ఇవ్వటమే కాకుండా ఊడిపోయిన జుట్టును తిరిగి పెరిగేటట్లు చేస్తాయి. దీనికి మనకు కావలసిన పదార్థాలు కూడా ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి కనుక ఎటువంటి ఖర్చు లేకుండా అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.

 దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు మెంతులు, బిర్యానీ ఆకు మరియు ఉల్లిపాయ పైన ఉండే పొర. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఉల్లిపాయ తొక్కలోని సల్ఫర్ మూలంగా జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. కనీసం వారానికి రెండు సార్లు ఈ చిట్కా ప్రయత్నించడం వలన ఒత్తయిన జుట్టుని తిరిగి పొందవచ్చు. దానికోసం పొయ్యిపై ఒక గ్లాస్ నీళ్లు పెట్టి అందులో ఒక స్పూన్ మెంతులు వేయాలి. అందులో రెండు, మూడు బిర్యానీ ఆకులను ముక్కలుగా తుంచి వేయాలి.

 ఉల్లిపాయ పైన ఉండే తొక్కను తీసి  ఈ నీటిలో వేయాలి. ఈ నీరు బాగా మరిగి నీళ్ళలోకి లక్షణాలన్నీ వచ్చేంతవరకు ఉంచాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి తలకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయాలి. తర్వాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయొచ్చు లేదా ఈ నీటిలో షాంపూని కలిపి తలకు స్నానం చేయొచ్చు. ఇలా చేయడం వలన తలలోని చుండ్రు ఇతర బ్యాక్టీరియా లక్షణాలతో ఉన్న ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. జుట్టురాలే సమస్యను తగ్గించి దృఢమైన పొడవైన జుట్టును అందిస్తుంది.

 మెంతులు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: మెంతులు విటమిన్లు ఎ, కె & సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఐరన్ మరియు ప్రోటీన్ల యొక్క గొప్ప వనరు, ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు కలిగి ఉంటాయి .

బిర్యానీ ఆకు చుండ్రును వదిలిస్తుంది.  

 షైనర్ జుట్టు.  జుట్టు కోసం బే ఆకును ఉపయోగించడం చుండ్రును తొలగించడంలో మాత్రమే కాకుండా, జుట్టును మెరిసేలా చేస్తుంది.   పేలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.  

ఫంగల్ ఇన్ఫెక్షన్ మరియు నెత్తిమీద మంట నుండి రక్షిస్తుంది.   జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

ఉల్లిపాయ తొక్కలు జుట్టు పెరుగుదలను పెంచడమే కాక, మంచి సహజమైన హెయిర్ డైగా కూడా ఉపయోగపడతాయి, ఇది జుట్టుకు బంగారు, గోధుమ రంగు నుండి నల్లటి రంగును ఇస్తుంది.

Leave a Comment

error: Content is protected !!