hair growth naturally at home

జుట్టుని సూపర్ ఫాస్ట్-గా పెంచే ఈ ప్యాక్-నీ వారానికి ఒక సారి రాయండి..

వేసవి మొదలయ్యింది ఎండ, వేడి తట్టుకోలేక ఇంటి వాతవరణన్నీ కూల్-గా ఉంచడానికి ఎసి, కూలర్, ఫ్యాన్ లాంటి ఉపకరణాలు వాడుతున్నాం… శరీరాన్ని చల్లబరిచెందుకు ఐస్ క్రీం,కూల్ డ్రింక్, ఫ్రూట్ జ్యూస్ ఇలా నాన ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం..కానీ ఎన్నో కారణాలకు వెడేక్కిపోయే మన శిరోభాగన్ని మాత్రం అలానే వొదిలేస్తున్నాం… మహా అంటే నూనె రాసుకోవటం తప్ప మరేం చేస్తున్నాం.! 

వేసవి కాలంలో చమటలు పడుతుంటుంది కాబట్టి జుట్టు జిడ్డుగా తయారై చుండ్రు,చివర్లు చిట్లిపోవటం,జుట్టు రాలటo, పొడిబారిపోవటం,కుదుళ్ళ రంగు మారటం లాంటి సమస్యలు ఎన్నో ఎదురుకుంటం కదా.!! ఈ సమస్యలు రానట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..

* మొదటిగా ఇవన్నీ సమస్యలకు పరిహారంగా మంచి హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. 
మామూలుగా సరళ పరిహారాలు వంటింట్లో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు వంటింటికి వెళ్లి కప్ పెరుగు రెండు కోడి గుడ్డు తీసుకుందాం.ఒక వేళ మీ జుట్టు చిన్నగా,పల్చగా ఉంటే అర కప్పు పెరుగు,ఒక గుడ్డు వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలిపి కుదుళ్ల చివరి దాకా పట్టించడం అంతే. హెయిర్ ప్యాక్ కలిపేప్పుడు స్టీల్ లేదా ఐరన్ గిన్నెలు వాడుకోండి. చాలా మంచి ఫలితం కనిపిస్తుంది.

*హెయిర్ ప్యాక్ ఉపయోగాలు. •పెరుగులో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటుంది కాబట్టి చుండ్రును తగ్గిస్తుంది. •వేసవిలో జుట్టు ఎండిపోయినట్టు కళహీనంగా ఉంటుంది, అలాంటి జుట్టును మృదువుగా, చిక్కు రహితంగా చేస్తుంది. •పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది ఇది జుట్టుకు కండిషనింగ్ చేస్తుంది.  •ఇందులోని మెగ్నీషియం అంశం జుట్టు రాలకుండా సహాయపడుతుంది•మరియు పెరిగులోని బయోటిన్ జుట్టు పెరుగుదకు పోషకాలు అందిస్తుంది.

*కోడి గుడ్డు.•గుడ్డులో నియాసిన్, రిబోప్లేవిన్, పొటాషియం మరియు సోడియం లాంటి కే జుట్టు పెరగటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. •కోడి గుడ్డులోని పచ్చటి భాగంలో ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి జుట్టు సాప్ట్-,సిల్కీగా ఉంటుంది.

*కొన్ని జాగ్రత్తలు°ఈ హెయిర్ ప్యాక్-లో కోడి గుడ్డుకు బదులుగా మెంతులు కూడా వాడవచ్చు.°కొందరికి లాక్టిక్ అలర్జీ ఉంటుంది అలాంటి వారు పెరుగు వాడకూడదు.°మీ నెత్తి జిడ్డుగా ఉండి ఆయిలి హెయిర్ ఉన్నవారు కూడా పెరుగు వాడొద్దు. 
చూసారు కదా ఈ వేసవిలో జుట్టు కోసంఈ సులువైనా హెయిర్ ప్యాక్ వేసుకొని తలను కూడా కూల్ చెయ్యండి.

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!