శరీరానికి ఏ అనారోగ్యం వచ్చినా లేదా బయట వాతావరణ పరిస్థితులు మారిన మొదట ప్రభావం చూపించేది చర్మం మీద లేదా జుట్టు మీద. కొంతమందికి చర్మం సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ రెండిట్లో ఏదైనా కారణం ఉందేమో గమనించుకోవాలి. అలాగే జుట్టు ఊడిపోతున్నా ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయన్నా మన చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా శరీర ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు బయట పొల్యూషన్ వల్ల తలలో ఉండే చర్మంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు జుట్టు రాలిపోవడం జరుగుతుంది.
అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది మామూలుగా జుట్టుకు నూనె రాయడం వల్ల పోషకాలను అందించడంతోపాటు కుదుళ్ళ నుంచి బలంగా చేయడంలో సహాయపడుతుంది. దానితోపాటు సమస్యలను తగ్గించి జుట్టు బలంగా తయారవడానికి ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్ధాలు కలిపి మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలి. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు కొబ్బరి నూనె మన ఎంత పరిమాణంలో కావాలి అనుకుంటున్నామో అంత పరిమాణంలో కొబ్బరి నూనె తీసుకోవాలి.
ఆర్గానిక్ లేదా గానుగ నూనె అయితే చాలా మంచిది దానిలోకి ఉసిరికాయలు తీసుకోవాలి. సీజన్ ఉన్నప్పుడు ఉసిరి కాయలు తీసుకొని ముక్కలుగా తరిగి ఎండబెట్టుకుంటే సంవత్సరమంతా ఉపయోగపడతాయి. ఇలా ఎండపెట్టడం వలన దానిలోని పోషకాలు పోకుండా ఉంటాయి. ఉసిరిని తాజాగా దొరికినప్పుడు అలానే ఉపయోగించవచ్చు. ఉసిరికాయ ముక్కలుగా కోసి నూనెలో వేయాలి. అలాగే వేపాకులు కోసి నీడలో ఆరబెట్టాలి. అవి ఎండిన తరువాత నూనె కోసం ఉపయోగించవచ్చు.
వేపాకులు తలలో వచ్చే చిన్న చిన్న కురుపులు, పేలు ఇంకా అనేక ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత పదార్థం మొరింగా ఆకు లేదా మునగాకు. మునగ ఆకులను కూడా అ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని నూనె కోసం ఉపయోగించాలి. ఇవన్నీ బాగా మరిగి వీటి లక్షణాలు నూనెలో చేరాయి అని తెలియడానికి నూనె పచ్చగా మారుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసి నూనె చల్లార్చుకోవాలి. ఈ నూనెను బాటిల్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను కాటన్ బాల్ తో కుదుళ్ళకు అప్లై చేయాలి.
తర్వాత ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయడం వలన తల లోని చర్మానికి రక్త ప్రసరణ మెరుగ్గా ఉండడంతో పాటు నూనెలోని పోషకాలు అందుతాయి. జుట్టు దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది. తలలో దురద తగ్గుతుంది. చుండ్రు సమస్య పోతుంది. ఇలా నూనె అప్లై చేసినప్పుడు షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల స్టిమ్యులేషన్ జరిగి జుట్టు పెరుగుదల ఎక్కువవుతుంది. ఎంతో ఉపయోగపడే ఈ నూనె తయారు చేసుకోవడం చాలా సులభం.