ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు రావడం, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు మార్కెట్లో దొరికే పట్ల చాలా రకాల కెమికల్స్ ఉంటాయి.ఇవి జుట్టుకు చాలా హాని కలిగిస్తాయి. అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దీని కోసం ముందుగా మనం అల్లం తీసుకుని తొక్క తీసుకోవాలి.
తర్వాత గ్రేటర్ సహాయంతో మెత్తగా తురుముకోవాలి. అల్లం ఏంటి ఆక్సిడెంట్స్, పొటాషియం, పాస్ఫరస్ పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చుండ్రు, దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. తెల్ల వెంట్రుకలను తగ్గించి జుట్టు నల్లగా, ఒత్తుగా రావడంలో సహాయపడతాయి. తర్వాత ఈ ఆయిల్ కోసం రెండు చెంచాల లవంగాలను తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. లవంగాలు జుట్టు సిల్కీగా, పొడవుగా పెరగడంలో సహాయపడతాయి.
లవంగాలు కూడా యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉండడం వల్ల చుండ్రు, దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. స్కాల్ప్ పై ఉండే ఇన్ఫెక్షన్స్ తగ్గడం వలన జుట్టు కుదుళ్లు బలంగా తయారయ్యి జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఒక గిన్నె తీసుకొని 2 చెంచాల లవంగాల పొడిని వేసుకోవాలి. మన ముందుగా తురుముకొని పక్కన పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిపి స్టవ్ మీద పెట్టి సర్వ్ చేస్తే ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి.
అల్లంలో ఉండే తడి మొత్తం ఇంకి పోయేంతవరకు నూనెను మరగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి నూనెలో చల్లార్చుకోవాలి. చల్లారిన నూనెను వడకట్టుకొని ఒక చెంచా కాస్టర్ ఆయిల్ లేదా విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి. వద్దు అనుకున్నవాళ్లు ఇలానే వాడుకోవచ్చు. నూనె ఏదైనా గాజు సీసాలో పెట్టి నెలరోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ నూనెను అప్లై చేసుకోవడానికి ముందు డబల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్ళ దగ్గర నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి.
అప్లై చేసిన తర్వాత కనీసం నాలుగు గంటలపాటు ఉండనివ్వాలి. లేదా రాత్రి అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.