జుట్టు రాలే సమస్య ఈ కాలంలో ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట. జుట్టు రాలే సమస్యకి మెంతులు చాలా బాగా ఉపశమనం కలిగిస్తుంది. కెమికల్స్ నుండి దూరంగా ఉండాలి అనుకునేవారు మెంతులను ఆహారంలో మరియు సౌందర్య రక్షణలో భాగం చేసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. కానీ దానిని సరైన పద్థతిలో ఎలా వాడాలో తెలుసుకుని వాడితే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు.
దానికోసం మనం ఒక నాలుగు చెంచాలు మెంతులు తీసుకోవాలి. వీటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం కొంచెం నీటిని చేర్చి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ వేయాలి. ఈ రెండింటిని బాగా కలిపి తలకు అప్లై చేయాలి. తర్వాత ఇరవై నిమిషాలు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేయడం వలన మెంతులు జుట్టు సమస్యలు అయిన చుండ్రు, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
మెంతులు సహజ కండిషనర్గా పనిచేసి జుట్టును మృదువుగా చేస్తాయి. విటమిన్ ఈ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. తర్వాత చిట్కా కోసం మెంతులు పొడి రెండు స్పూన్లు తీసుకుని అందులో స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. దీనిని అప్లై చేసుకోవడానికి వీలుగా కొద్దిగా నీటిని కలుపుతూ బాగా మిక్స్ చేయాలి. తర్వాత జుట్టుకు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చేయడం వలన తలలో ఫ్రిజీ నెస్ తగ్గి జుట్టు మృదువుగా అవుతుంది.
కలబంద తాజాగా దొరికితే అది వారి డుకోవచ్చు. లేనివారు బయట మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ ఉపయోగించవచ్చు. కలబంద జుట్టు పెరుగుదలకు, చుండ్రును అడ్డుకోవడానికి, చివర్లు చిట్లినవి సరిచేయడానికి సహకరిస్తుంది.ఈ చిట్కాలలో ఏదొకటి క్రమం తప్పకుండా పాటించడం వలన జుట్టు రాలే సమస్యలు సహజంగా అరికట్టవచ్చు. మెంతులు జుట్టు సంరక్షణకు ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పుకోవాలి. మెంతులు వాడడం వలన అందమైన, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు సొంతం చేసుకోవచ్చు.