Hair Growth Shampoo Hair Growth Drink

మీరు ఏ టిప్స్, రెమిడీస్ వాడకుండా ఈ ఒక్క డ్రింక్ వాడితే చాలు. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది

చుండ్రు, జుట్టు రాలే సమస్యలు వంటి సమస్యలకు  అనేక రకాల షాంపూలు వాడుతూ ఉంటాం. ఎన్ని వాడినా ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి సహజ పదార్థాలతో చేసిన షాంపు ఉపయోగించాలి అనుకున్నా సరైన అవగాహన లేక మళ్లీ కెమికల్స్ నిండిన షాంపూలే  ఉపయోగిస్తూ ఉంటారు. దానికి విరుగుడుగా మన ఇంట్లోనే షాంపు తయారు చేసుకుని వాడుకోవచ్చు.  దానితో పాటు ఉ ఒక మంచి హెల్త్ డ్రింక్ జుట్టు సమస్యలను తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఈ షాంపూ, హెల్త్ డ్రింక్ రెండు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

మందార ఆకులు జుట్టు సంరక్షణకి చాలా బాగా ఉపయోగపడతాయని  మనందరికీ తెలుసు. మందార ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. వీటిని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా పిసికి జిగురుగా అయ్యేలా చేయాలి. తరువాత ఆ నీటిలో రెండు స్పూన్ల కుంకుడుకాయల పొడి, రెండు స్పూన్ల  శీకాకాయ పొడి వేసుకోవాలి. ఉంటే మెంతుల పొడి ఒక స్పూన్ లేదా ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చు. దీనితోపాటు ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ అవిసె గింజల పొడి లేదా అవిస గింజలు వేసుకోవాలి. ఈ నీళ్ళు జిగురుగా అవ్వడం మొదలుపెట్టగానే స్టవ్ ఆపేసి ఈ నీటిని వడకట్టుకోవాలి.

నీళ్ళు చల్లారితే అవిశెగింజలు వలన నీళ్ళు జెల్గా మారిపోతాయి. డబల్ ఫిల్టర్ చేయడం వలన దీనిలో ఉన్న మెత్తటి పొడి కూడా పక్కకు వచ్చేస్తుంది. లేదంటే తలలో ఇరుక్కొని చికాకు పెట్టవచ్చు. తర్వాత షాంపూతో అర చెక్క నిమ్మ రసం పిండుకోవాలి. ఈ షాంపూ పెద్దగా నురగరాదు కనుక నిమ్మరసం తలలో జిడ్డుగా ఉంటే తొలగిస్తుంది. ఫ్రిజీ, పొడిగా ఉండే జుట్టుకు ఈ షాంపూ చాలా బాగా పనిచేస్తుంది. ఆయిలీ స్కాల్ఫ్ వాళ్ళు మందారాకులకు బదులు నీళ్ళు మరుగుతున్నపుడు గ్రీన్ టీ ఆకులు వేసుకోవాలి.

రెండో షాంపూ కోసం రెండు స్పూన్ల మెంతులు పొడి గ్లాసు నీటిలో కలిపి ఆ నీటిని వడకట్టి అందులో ఒక స్పూన్ షాంపూ , ఒక స్పూన్ కాపీ పొడి కలిపాలి. ఈ మిశ్రమాన్ని  తలకు పట్టించాలి. ఈ నీటిని వాడడం వలన జుట్టు సమస్యలు తగ్గి జుట్టు బలంగా పెరుగుతుంది. సహజమైన పదార్థాలు వలన దుష్పభవాలు లేకుండా జుట్టు రాలె సమస్యలు కూడా తగ్గుతాయి.

తర్వాత జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా ఉండడానికి ఒక డ్రింక్ తెలుసుకుందాం. ఒక చిన్న అల్లం ముక్క, ఒక పెద్ద పచ్చిమిర్చి తీసుకోవాలి. దీనిలో నాలుగు స్పూన్ల పెరుగు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఇందులో రుచికోసం కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. లేదంటే అలాగే తాగేయవచ్చు.  ఇదొక్కటి తాగితే చాలు అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు. ఏ చిట్కా పాటించినా కనీసం రెండు నెలలపాటు వాడాలి. అలా వాడినపుడు మాత్రమే సరైన ఫలితాలలో తేడా తెలుస్తుంది. అందుకే పైన చెప్పిన షాంపూలతో పాటు ఈ డ్రింక్ కూడా తాగి మీ జుట్టు సమస్యలు తొలగించుకోండి.

Leave a Comment

error: Content is protected !!