జుట్టు రాలే సమస్యను అరికట్టడానికి అనేక రకాల షాంపూలు వాడుతూ ఉంటాం. వాటి వలన ప్రయోజనాలు ఎన్నున్నాయో దుష్ప్రభావాలు కూడా అన్ని ఉంటాయి. వాటిలో ఉండే కెమికల్స్ వలన జుట్టు పొడిబారడం, రాలడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యల నుండి బయటపడడానికి సహజసిద్దమైన పదార్ధాలతో చేసిన హెర్బల్ షాంపూ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాని కోసం మనకు కావలసిన పదార్థాలు కుంకుడు కాయలు, శీకాకాయ, జామ ఆకులు.
జామ ఆకులు ఎందుకు అనుకుంటున్నారా? జామ ఆకులు జుట్టు రాలే సమస్యను అధిగమించడానికి చాలా బాగా పనిచేస్తాయి. అనేక ఇతర ప్రయోజనాలతోపాటు, జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి, తద్వారా జుట్టు దెబ్బతినకుండా చేస్తుంది.
జామ ఆకులలో లైకోపీన్ ఉంటుంది, ఇది మీ జుట్టును సూర్యుని హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది.
జామ ఆకుల నీటిలోని విటమిన్ సి కొల్లాజెన్ కార్యకలాపాలను మరియు జుట్టు పెరుగుదలను పెంచుతుంది. విటమిన్ బి జుట్టు తంతువులను నిర్మించడానికి మరియు జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ రెండూ జుట్టు పెరుగుదలకు అవసరం. కాబట్టి, జుట్టు పెరుగుదలకు జామ ఆకులను ఉపయోగించడం మిమ్మల్ని నిరాశపరచదు.
శీకాకాయ మరియు కుంకుడుకాయలు పూర్వం నుండి జుట్టు రక్షణలో ఉపయోగిస్తూనే ఉన్నారు. పూర్వం మన పెద్దలు వీటితో తల స్నానం చేయడానికి ఎక్కువగా ఉపయోగించేవారు. వీటి వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు మరియు జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహకరిస్తాయి. వీటిలో ఉండే నేచురల్ హెయిర్ కండీషనర్ లక్షణాల వలన జుట్టు మృదువుగా అదుపులో ఉంటుంది.
ఎండిపోయినట్టు, పగిలినట్టు ఉండే జుట్టుకు షాంపూ బదులు శీకాకాయ పేస్ట్ అప్లై చేసి కుంకుడు కాయలతో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పబోయే చిట్కా కూడా అంతే మంచి రిజల్ట్స్ తెలుస్తుంది. దాని కోసం గింజలు తీసేసిన కుంకుడు కాయలు, శీకాకాయలు తీసుకోవాలి. వీటితో పాటు నాలుగైదు జామాకులను చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసుకోవాలి వీటిలో గ్లాస్ ఉన్న నీటిని వేసి మరిగించాలి.
వీటిలో ఉండే గుణాలు నీటిలో దిగి ఎంత వరకు మరిగించి తరువాత నీటిని వడకట్టాలి. ఈ నీటిని ఫ్రిజ్లో పెట్టుకుని వారానికి రెండుసార్లు తల స్నానం చేయడం వలన చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం, చివర్లు చిట్లడం వంటి సమస్యలన్నీ తగ్గి జుట్టు వేగంగా పొడవుగా పెరుగుతుంది. పలచబడిన జుట్టును తిరిగి ఒత్తుగా చేస్తుంది. జుట్టుకు కండిషన్ చేస్తుంది.